E-Paper
Advertisement

AP Govt: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

AP Govt: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్
Advertisement

AP Govt: ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ఇచ్చింది. డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్‌ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్‌ చేసింది. డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు రూ.2,653 కోట్ల నిధులను సోమవారం విడుదల చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌ కోసం రూ.1,100 కోట్లు విడుదల చేసింది. పోలీసుల సరెండర్‌ లీవులకు రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్‌, సాస్కీ, సీఆర్‌ఐఎఫ్‌ పనులకు కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధిచేకూరింది.

పోలీసులకు సరెండర్ లీవ్ నిధులు

డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛన్ దారులకు లబ్ధి చేకూరనుంది.పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లలో రూ.110 కోట్లు విడుదల చేశారు. దీంతో సుమారు 55 వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్ ల నిధులు చెల్లించనున్నారు. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ. 1243 కోట్ల విడుదల చేశారు. ఇందులో నీరు-చెట్టు బిల్లుల కింద సుమారు రూ.40 కోట్లు విడుదల చేశారు.

19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు

Advertisement

నీరు-చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన 19 మంది కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి పండుగ కానుకగా పెండింగ్ బిల్లులు నిధులు విడుదల చేసింది.

Also Read:  ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×