E-Paper
Advertisement

Kids Friendly Smartphone: పిల్లల కోసం స్పెషల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త ఫోన్‌లో ఫీచర్స్ ఇవే..

Kids Friendly Smartphone: పిల్లల కోసం స్పెషల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త ఫోన్‌లో ఫీచర్స్ ఇవే..
Advertisement

Kids Friendly Smartphone| ఇటీవలి కాలంలో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కు అలవాటుపడ్డారు. చిన్నవయసులోనే ఫోన్ ని విపరీతంగా ఉపయోగిస్తున్నవారు దీనివల్ల ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే పిల్లల కోసమే ఒక ప్రత్యేక ఫోన్ ని తీసుకొచ్చింది.. హెఎండి గ్లోబల్ (HMD Global) అనే కంపెనీ. ఈ ఫోన్ త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఈ ఫోన్ తయారు చేయడంలో Xplora అనే కంపెనీ కూడా హెఎండి గ్లోబల్ టెక్ కంపెనీతో కలిసి పని చేసింది. అందుకే ఈ ఫోన్ పేరు HMD XploraOne. ఈ ఫోన్ మొదట కొన్ని దేశాల్లోనే విడుదల అవుతుంది. ఇది పిల్లలకు సురక్షితమైన ఫోన్ అని, సింపుల్‌గా చిన్నారులకు టెక్నాలజీ పరిచయం చేసే ఫోన్ అని ఫోన్ తెలిపింది.

ఫోన్‌లో చిన్న పిల్లల సేఫ్టీకి ప్రాధాన్యం

ఈ ఫోన్‌లో కేవలం కాల్ చేయడం, మెసేజ్ పంపడం మాత్రమే ఉంటాయి. గేమ్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి విపరీత ప్రభాతం చూపూ యాప్స్ ఏవీ ఉండవు. ఇంటర్నెట్ పూర్తిగా బ్లాక్ చేసి ఉంటుంది. తల్లిదండ్రులే ఫోన్‌ను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. పిల్లలు సురక్షితంగా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఇది బెస్ట్.

Advertisement

తల్లిదండ్రులకు ఏం ఏం సౌకర్యాలు ఉన్నాయి?
తమ ఫోన్ నుంచే తల్లిదండ్రులు కాంటాక్ట్స్ జోడించవచ్చు, తీసేయవచ్చు. అవసరం లేని నెంబర్లను బ్లాక్ చేయవచ్చు. పిల్లలు ఎక్కడ ఉన్నారో రియల్ టైమ్‌లో లొకేషన్ చూడవచ్చు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పిపోతారనే ఆందోళన లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి?

ఫోన్ స్క్రీన్ 3.2 అంగుళాలు, QVGA డిస్‌ప్లే, దానికి బలమైన 2.5D గ్లాస్ ఉంటుంది. లోపల Unisoc T127 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ 64 MB మాత్రమే, స్టోరేజ్ కూడా చాలా తక్కువ 128 MB. మెమరీ కార్డు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

కెమెరా, బ్యాటరీ ఎలా ఉన్నాయి?

Advertisement

వెనుక 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందు 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాటరీ 2000 mAh, టైప్-C చార్జింగ్ ఉంటుంది. దుమ్ము, నీరు నుంచి కొంచెం కొంతవరకు రక్షణ కోసం IP52 రేటింగ్ ఉంది.

కలర్ వేరియంట్స్

మొదట రెండు రంగుల్లో మాత్రమే లాంచ్ కానుంది. నలుపు-బూడిద (Charcoal), సముద్రపు నీలం (Cyan Blue). రెండూ పిల్లలకు నచ్చే రంగులే.

ఫోన్‌లో ఏ ఏ యాప్స్ ఉంటాయి?

కేవలం క్యాలెండర్, క్యాల్‌కులేటర్, గ్యాలరీ లాంటి బేసిక్ యాప్స్ మాత్రమే ఉంటాయి. బటన్లు పెద్దవిగా, సులభంగా నొక్కేలా ఉంటాయి. దీంతో ఈ ఫోన్ వినియోగం పిల్లలకు సులభతరం అవుతుంది.

ఫోన్ ఎప్పుడు కొనొచ్చు?

ఇప్పటికే Xplora వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆసక్తి ఉన్నవాళ్లు వెబ్‌సైట్‌ చెక్ చేసి తమ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొదటి బ్యాచ్‌లో ఫోన్లు తక్కువే ఉంటాయి కాబట్టి ఫోన్ కొనాలనుకుంటే త్వరగా రిజిస్టర్ చేయండి.

ఈ ఫోన్ ఎందుకు మంచిది?

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలు అవుతున్నారు. ఈ ఫోన్ కాల్-మెసేజ్ సౌకర్యం ఇస్తూనే, గేమ్స్-సోషల్ మీడియా నుంచి దూరం పెట్టి సురక్షితంగా ఉంచుతుంది. చిన్నప్పటి నుంచే సరైన డిజిటల్ అలవాట్లు నేర్పిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమంగా టెక్నాలజీ గురించి అలవాటు చేయడానికి, వారు తప్పిపోకుండా ఉండడానికి ఈ ఫోన్ ఒక మంచి గాడ్జెట్. అందుకే పిల్లల మొదటి ఫోన్‌గా HMD XploraOne ఒక సూపర్ ఆప్షన్!

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×