E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అర్థరాత్రి కత్తిపోట్ల కలకలం, ఓ వ్యక్తి హత్య

Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అర్థరాత్రి కత్తిపోట్ల కలకలం, ఓ వ్యక్తి హత్య
Advertisement

Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి హత్య గురయ్యాడు. జునైద్ అనే వ్యక్తిని చంపేశారు సొంత బావలు అలీ, ఉమర్. ఇంట్లో నుంచి రాగానే కత్తులతో నరికి నరికి చంపేశారు నిందితులు. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌లో నిందితులు లొంగిపోయారు. అసలేం జరిగింది?

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం..

Advertisement

హైదరాబాద్ రెయిన్ బజార్ పరిధిలోని చోటాపూర్ సమీపంలో జునైద్ అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి చంపేశారు నిందితులు. రౌడీ షీటర్ పహిల్వాన్ కొడుకులు ఉమర్, అలీ. తన అత్త కొడుకు జునైద్‌పై కక్ష పెంచుకున్నారు. చాలా రోజులుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు సమాచారం.

చివరకు తారాస్థాయికి చేరుకున్నారు. తమకు చీటికి మాటికీ అడ్డు వస్తున్నాడని కారణంతో జునైద్‌ని చంపాలని డిసైడ్ అయ్యారు. జునైద్ గతరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అడ్డగించి పదునైన కత్తులతో దారుణంగా నరికేశారు. ఘటన గురించి తెలియగానే రెయిన్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

అర్థరాత్రి కత్తిపోట్ల కలకలం, ఓ వ్యక్తి హత్య

వెంటనే అంబులెన్సులో యశోదా ఆసుపత్రికి బాదితుడ్ని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జునైద్ మరణించాడు. జునైద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

రెండురోజులుగా పాతబస్తీలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా సరే పాత పగలు నేపథ్యంలో తాజాగా హత్య జరిగింది. మరోవైపు మృతుడి ఇంటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: రైల్వేస్టేషన్ భారీ శబ్దంతో బాంబుపేలుడు

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×