E-Paper
Advertisement

Whatsapp Ads: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

Whatsapp Ads: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి
Advertisement

Whatsapp Ads Hide| వాట్సాప్‌లో ఇప్పుడు యాడ్స్ (ప్రకటనలు) కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్ద మార్పు. వాట్సాప్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆదాయం పెంచుకోవాలనే ప్లాన్‌లో భాగంగా మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు చాలా దేశాల్లో వాట్సాప్ చానల్స్ ఫీడ్‌లో, స్టేటస్ మధ్యలో యాడ్స్‌ కనిపిస్తున్నాయి. అయితే ఈ యాడ్స్ ఇంతవరకూ ప్రైవేట్ చాట్స్‌లో రాలేదు. కానీ స్టేటస్, చానల్స్‌లో మాత్రం యాడ్స్ ప్రారంభమైపోయాయి.

యాడ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి?

చాలా మంది యూజర్లు యాడ్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. స్టేటస్ చూస్తుంటే మధ్యలో “Sponsored” అని రాసి ఒక ప్రకటన వస్తోంది. అలాగే చానల్స్ ఫీడ్‌లో స్క్రోల్ చేస్తే యాడ్స్ కనిపిస్తున్నాయి. కొందరికి వాట్సాప్ నుంచి యాడ్స్ గురించి నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. “మేము యాడ్స్ చూపిస్తున్నాం” అని మెటా ముందుగా నోటిఫై చేస్తోంది. అంటే ఇది పూర్తిగా రోల్ అవుట్ ప్లాన్. కేవలం ఆదాయం పెంచుకోవడానికే వాట్సాప్ ఇదంతా చేస్తోంది.

యాడ్స్ గురించి వాట్సాప్ చెబుతున్న కారణాలు

Advertisement

యూజర్లకు కొత్త బిజినెస్‌ల గురించి సులభంగా తెలియచేయడానికి యాడ్స్ చూపిస్తున్నామని మెటా ప్రకటించింది. యాడ్ చూసి నచ్చితే డైరెక్ట్ చాట్ ఓపెన్ అవుతుంది. కానీ యాడ్స్ ప్రస్తుతానికి వాట్సాప్ ఛానెల్, స్టేటస్ వరకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ చాట్స్, కాల్స్ ఇప్పటికీ పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ఉన్నాయి. యాడ్స్ కోసం యూజర్ల పర్సనల్ డేటా ఉపయోగించడం లేదని మెటా తెలిపింది.

యాడ్ నచ్చకపోతే ఎలా తొలగించాలి?

చాలా సింపుల్! యాడ్ పక్కన “Sponsored” అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి.. అక్కడ మూడు చుక్కల మెనూ (⋮) పై ప్రెస్ చేయండి. అక్కడ “Hide Ad” ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ యాడ్ వెంటనే పోతుంది. ఇలా చేస్తే వాట్సాప్ మీ యాడ్స్ మీ ఇష్టాలకు మరింత బెటర్‌గా చూపిస్తుంది.

యాడ్ లో తప్పుడు సమాచారం ఉంటే ఎలా రిపోర్ట్ చేయాలి?

Advertisement

యాడ్ పక్కనే మూడు చుక్కల మెనూ (⋮) ఉంటుంది. అక్కడ “Report Ad” ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి.. ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారో కారణం తెలిపి సబ్‌మిట్ చేయండి. వాట్సాప్ ఆ యాడ్‌ను చెక్ చేసి తొలగిస్తుంది.

యాడ్స్ పూర్తిగా ఆఫ్ చేయడం సాధ్యమేనా?

పూర్తిగా ఆఫ్ చేయడం అనే ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. కానీ మీకు ఏ రకం యాడ్స్ చూపించాలో మీరు కంట్రోల్ చేయొచ్చు. దీని కోసం కొన్ని సెట్టింగ్స్ చేయాలి.
వాట్సాప్ ఓపెన్ చేసి -Settings – Account Center – Account Settings – Ad Preferences అని ఉంటుంది. అక్కడ మీకు నచ్చని కేటగిరీలు ఆఫ్ చేయండి. ఇలా చేస్తే చాలా వరకు బాధించే యాడ్స్ తగ్గుతాయి.

యాడ్స్ రావడంతో వాట్సాప్ ఇక ఫ్రీ యాప్‌గా ఉండదు అని చాలా మంది భావిస్తారు. అది పూర్తిగా నిజం కాదు.. కానీ ఆదాయం పెంచుకోవడానికి మెటా యాడ్స్ రూట్ ఎంచుకుంది. చాట్స్ సేఫ్‌గానే ఉన్నాయి. యాడ్స్ బాధిస్తే పైన చెప్పిన ట్రిక్స్ ట్రై చేయండి. చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.

Also Read: ఆండ్రాయిడ్ లో ఐఫోన్ ఫీచర్స్.. 15 ఏళ్ల ఇండియన్ కుర్రాడి అద్భుత సృష్టి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×