E-Paper
Advertisement

OTT Movie: ఓటీటీలోకి రాజశేఖర్ కూతురు లేటెస్ట్ రొమాంటిక్ మూవీ… ఎక్కడ చూడచ్చంటే ?

OTT Movie: ఓటీటీలోకి రాజశేఖర్ కూతురు లేటెస్ట్ రొమాంటిక్ మూవీ… ఎక్కడ చూడచ్చంటే ?
Advertisement

OTT Movie : ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన ఒక తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఓ మంచి ఎంటర్టైనర్ దొరికినట్టే. థియేటర్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

సారంగ్ తియాగు దర్శకత్వం వహించిన ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ఆరోమలే’. కిషన్ దాస్, శివాత్మిక జంట గా నటించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హర్షత్ ఖాన్, VTV గణేష్, మేఘ ఆకాష్, తులసి, శిబి జయకుమార్, నమ్రిత MV, సంధ్య విన్‌ఫ్రెడ్ సహాయక పాత్రల్లో నటించారు. చిత్రానికి గౌతమ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్, సిద్ధు కుమార్ సంగీతం అందించారు. 2025నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఐయండిబిలో 8.5/10 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

Read Also : క్రీస్తును కొత్త కోణంలో చూపించన సినిమా… ఆ సీన్స్ తో వివాదాల సునామీ

స్టోరీ ఏమిటంటే

అజిత్ అనే యువకుడు సినిమాల్లోలా లవ్ మ్యాజిక్‌లా జరుగుతుందని నమ్ముతాడు. కానీ రియల్ లైఫ్‌లో ఎప్పుడూ మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్ల ఫెయిల్ అవుతాడు. ఒక రోజు తన క్రష్ పెళ్లి క్రాష్ చేయడానికి బెస్ట్ ఫ్రెండ్ సచిన్ తో చర్చికి వెళ్లి గొడవ పడి జైలు దాకా వెళ్తాడు. ఆ సంఘటన తర్వాత తల్లిదండ్రులు అతన్ని మ్యాట్రిమోనీ ఏజెన్సీలో జాబ్ పెడతారు. అక్కడ అతని బాస్ అంజలి (శివత్మిక రాజశేఖర్) ఒక ప్రాక్టికల్ అమ్మాయి. ఎమోషన్స్ కంటే లాజిక్, కంపాటిబిలిటీనే ఎక్కువగా నమ్ముతుంది. అజిత్ రొమాంటిక్ ఐడియాలు, అంజలితో క్లాష్ అవుతాయి.

Advertisement

జాబ్ చేస్తూ అజిత్ క్లయింట్స్‌తో మాట్లాడుతూ లవ్ అంటే ఎఫర్ట్, అండర్‌స్టాండింగ్ అని నేర్చుకుంటాడు. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. అంజలి మీద ఫీలింగ్స్ వచ్చి కాన్ఫెస్ చేయబోతే ఆమెకి ఇంకో రిలేషన్ ఉందని తెలుస్తుంది. అయితే స్టోరీ నడిచే కొద్ది అంజలితో మళ్ళీ ఓ అవకాశం వస్తుంది. అజిత్ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడా ? అంజలి ప్రేమను పొందుతాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, తమిళ రొమాంటిక్ కామెడీ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×