E-Paper
Advertisement

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!
Advertisement

Rachamallu: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కడపలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సామాన్యులు, మహిళలపై వంచన

Advertisement

ఓట్ల కోసం ప్రజలను వాడుకుని, గెలిచాక విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చుకోవడానికే ఈ ప్రభుత్వం పరిమితమైందని ఎద్దేవా చేశారు. నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి కోటిన్నర మంది మహిళలను ఘోరంగా మోసం చేశారని, ఆడవారిని మోసం చేసి బాగుపడినట్లు చరిత్రలో లేదని హెచ్చరించారు. అలాగే ఏటా ఇస్తామన్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.

రైతులకు, నిరుద్యోగులకు ద్రోహం

Advertisement

నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోశారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన రూ. 26 వేలలో భారీగా కోతలు పెట్టారని ఆరోపించారు. మంచి చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక అన్నదాతల నోట్లో మట్టి కొట్టడంతో రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు.

ఆరోగ్యం, విద్య రంగాల ధ్వంసం

పేదవాడికి అండగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీని కాస్తా ‘అనారోగ్య శ్రీ’గా మార్చేశారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టి ఉచిత చికిత్సలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేయకుండా వారి భవిష్యత్తును, జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే హామీలన్నీ అమలు చేసినట్లు ప్రజల్లోకి నేరుగా వెళ్దామా అంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Also Read: పవన్ కళ్యాణ్‌కు పాలిటిక్స్ తెలీదు.. మోదీ నమ్ముకుని బలి కావొద్దు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×