E-Paper
Advertisement

NBK111.. బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. జూన్ 10న డబుల్ ట్రీట్.. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో విశ్వరూపమే!

NBK111.. బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. జూన్ 10న డబుల్ ట్రీట్.. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో విశ్వరూపమే!
Advertisement

Balayya Buzz: నందమూరి బాలకృష్ణ… ఈ పేరు వింటే మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు, బాక్సాఫీస్ గల్లా పెట్టెలు కళకళలాడుతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’,అఖండ 2 సినిమాలే. ఇక అదే జోష్ లో తాజాగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 అంటూ మరో సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెల్సిందే.ఇక వీరసింహారెడ్డి’ కాంబో అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేసే న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.అవును .. రాబోయే జూన్ నెలలో నందమూరి అభిమానులకు ఒక భారీ డబుల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను మొదట ఒక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ డ్రామాగా ప్రారంభించినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల, అలాగే బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ థియేటర్లలో ఏవైతే మాస్ ఎలిమెంట్స్ ఆశిస్తారో, వాటన్నింటినీ పక్కాగా కుదిరేలా కథను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

Advertisement

జూన్ 7 నుంచి ఒక భారీ, సరికొత్త షెడ్యూల్‌

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక తదుపరి షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ ముంబై వెళ్ళబోతుందట. అక్కడే జూన్ 7 నుంచి ఒక భారీ, సరికొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాలోని అత్యంత కీలకమైన, మైండ్ బ్లోయింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లను భారీ బడ్జెట్‌తో షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే.. జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా బాలయ్య బర్త్ డే అంటేనే అభిమానులకు పెద్ద పండగ. అయితే ఈసారి ఆ పండగ వాతావరణాన్ని డబుల్ చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్  టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు, ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ లో గట్టిగానే వినిపిస్తుంది.ఈ గ్లింప్స్ బాలయ్య మార్క్ డైలాగ్స్, అదిరిపోయే విజువల్స్ తో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందట.

Advertisement

బాలయ్యకు తమ్ముడిగా మనోజ్ ?

ఈ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ మిస్ అయినా, ఈ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ సరికొత్తగా ఉండబోతోంది. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన పాత్రలన్నింటి కంటే ఈ చిత్రంలో ఆయన రోల్ పూర్తిగా భిన్నంగా, స్టైలిష్‌గా ఉంటుందని టాక్. ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో బాలయ్య స్క్రీన్‌పై విశ్వరూపం చూపించబోతున్నారని ఇన్ సైడ్ న్యూస్.
ఇక సినిమాపై అంచనాలను పెంచేసే మరో సెన్సేషనల్ అప్‌డేట్ ఏంటంటే.. ముంబైలో జరగబోయే ఈ కొత్త షెడ్యూల్‌లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కూడా జాయిన్ కాబోతున్నారు. చాలా కాలం తర్వాత మనోజ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కావడం విశేషం. ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్యకు తమ్ముడిగా నటిస్తూనే, గ్రే షేడ్స్ (నెగిటివ్ రోల్) ఉన్న క్యారెక్టర్‌లో మనోజ్ కనిపించబోతున్నారట.

జూన్ 10న రాబోయే ఆ బర్త్‌డే బ్లాస్టింగ్ ట్రీట్ 

బాలయ్య లాంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ పర్ఫార్మెన్స్, వారిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్‌లు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
మొత్తానికి ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా కావడం, దానికి తోడు బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్, మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ తోడవ్వడంతో NBK111 పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు బిజినెస్ వర్గాల్లోనూ అద్భుతమైన క్రేజ్ క్రియేట్ అవుతోంది. థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం పక్కా . చూడాలి మరి జూన్ 10న రాబోయే ఆ బర్త్‌డే బ్లాస్టింగ్ ట్రీట్ ఎలా ఉండబోతుందో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×