// // LPG Gas vs Induction: ఈ చిన్న మార్పుతో నెలకు రూ.1000 ఆదా! -->
E-Paper
Advertisement

LPG Gas vs Induction: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!

LPG Gas vs Induction: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!
Advertisement

LPG Gas vs Induction: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల మన దేశంలో కూడా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అనిశ్చితి వల్ల చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.

గతంలో కేవలం గ్యాస్ అయిపోయినప్పుడు వాడే బ్యాకప్ ఆప్షన్‌గా మాత్రమే ఉన్న ఇండక్షన్ స్టవ్.. ఇప్పుడు చాలామందిని ఆదుకుంటోంది. అయితే, పెరిగిన ధరల నేపథ్యంలో గ్యాస్ స్టవ్ వాడటం లాభమా? లేక ఇండక్షన్ పొయ్యికి మారడం ద్వారా డబ్బు ఆదా అవుతుందా? ఒకవేళ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.1000 వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

తగ్గేదేలే అంటున్న ధరలు:

Advertisement

ఢిల్లీ, పూణే, లక్నో వంటి నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. సిలిండర్ల బుకింగ్ సకాలంలో జరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా వ్యాపారాల మీద కూడా ప్రభావం చూపుతోంది. గ్యాస్ కొరత వల్ల కొన్ని రెస్టారెంట్లు తమ మెనూలోని కొన్ని వంటకాలను తాత్కాలికంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: మారుమూల గ్రామాల కోసం ఇంటర్నెట్ అక్కర్లేని మొబైల్స్.. భారత్‌లో తయారీ మొదలెట్టిన ఖుష్‌టెక్!

ఖర్చు విషయంలో ఏది బెటర్?

Advertisement

సాధారణంగా ఒక గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.950 వరకు ఉంటుంది. అయితే మనం వాడే గ్యాస్ స్టవ్‌లు కేవలం 55 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తాయి. అంటే.. వంట చేసేటప్పుడు సగానికి పైగా వేడి వృధా అవుతుంది. కానీ ఇండక్షన్ స్టవ్ అలా కాదు. అది విద్యుత్ శక్తిని నేరుగా వంట పాత్రకు చేరవేస్తుంది. దీనివల్ల వృధా చాలా తక్కువగా ఉంటుంది. విద్యుత్ ధరలను బట్టి చూస్తే.. ఇండక్షన్ వాడటం వల్ల నెలకు రూ.180 నుండి రూ.1,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సబ్సిడీ లేని గ్యాస్ వాడేవారికైతే విద్యుత్ పొయ్యిలే లాభదాయకమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

తగ్గని గ్యాస్ స్టవ్ వాడకం:

డబ్బు ఆదా అవుతున్నప్పటికీ చాలామంది ఇంకా గ్యాస్ స్టవ్‌లనే వాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్ కోతలు. కరెంట్ పోతే వంట ఆగిపోతుందనే భయం ఒకటైతే.. మన సంప్రదాయ వంట పద్ధతులు రెండో కారణం. చపాతీలు కాల్చడం, పోపు వేయడం వంటి వాటికి గ్యాస్ మంటపై ఉండే నియంత్రణ ఇండక్షన్ మీద ఉండదు. అంతేకాకుండా ఇండక్షన్ వాడాలంటే దానికి సరిపోయే ప్రత్యేక పాత్రలు కొనాలి. మన ఇళ్లలో ఉండే సాధారణ గిన్నెలు వీటికి సెట్ కావు. ఈ అదనపు పెట్టుబడి భారం వల్ల కూడా చాలామంది గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read: కరెంట్ అక్కర్లేదు, వై-ఫై వద్దు.. సిమ్ కార్డుతో పనిచేసే ఈ సోలార్ కెమెరా గురించి తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×