E-Paper
Advertisement

Sridhara Babu: కొత్త పెళ్లి కొడుకు అబద్ధాలు చెప్పిండు.. మల్లారెడ్డి పై శ్రీధర్ బాబు జోకులు

Sridhara Babu: కొత్త పెళ్లి కొడుకు అబద్ధాలు చెప్పిండు.. మల్లారెడ్డి పై శ్రీధర్ బాబు జోకులు
Advertisement

Sridhara Babu: జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు మల్లారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి ఇటీవల తన కుమారుడి వివాహం జరిపించిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయనను కొత్త పెళ్లికొడుకుగా సంబోధిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సభకు కొత్తగా వచ్చిన మల్లారెడ్డి ఈ సారైనా నిజాలే మాట్లాడతారని ఆశించానని, కానీ ఆయన మళ్ళీ పాత పద్ధతిలోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి చమత్కరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యను పూర్తిగా పరిష్కరించామని అప్పట్లో చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. మల్లారెడ్డి గారు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని.. అయితే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మల్లారెడ్డి అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని, ఆయన సూచనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

నగరంలో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషిస్తోందని మంత్రి వివరించారు. కేవలం జవహర్ నగర్‌పైనే భారం పడకుండా.. హైదరాబాద్ నగరం నలుమూలలా కొత్త డంప్ యార్డ్‌లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని.. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

Also Read: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×