E-Paper
Advertisement

Jio Offer: జియో బంపరాఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో.. రూ.35,100 సేవలు, 2TB స్టోరేజ్ ఫ్రీ..!

Jio Offer: జియో బంపరాఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో.. రూ.35,100 సేవలు, 2TB స్టోరేజ్ ఫ్రీ..!
Advertisement

Jio Offer: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. అపరిమిత కాల్స్, 5G డేటా, ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కాంబోలో ఇప్పటికే పలు ప్లాన్లను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ తో కలిసే అద్భుతమైన ఆఫర్ ను జియో తీసుకొచ్చింది. దీని ద్వారా ఉచిత గూగుల్ ఏఐ ప్రో (Gemini Pro) సబ్ స్క్రిప్షన్, 2 TB క్లౌడ్ స్టోరేజ్ పొందే అవకాశం కల్పిస్తోంది.

అర్హత కలిగిన ప్లాన్‌లు..

జియో ఈ ఉచిత గూగుల్ సేవలను కొన్ని ప్లాన్స్ లో అదనపు ప్రయోజనాల కింద అందిస్తోంది. కాబట్టి జెమిని ప్రో, క్లౌడ్ స్టోరేజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకునే అవసరం లేదు. నెలకు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ పడే అన్ లిమిటెడ్ 5G జియో ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు. పోస్ట్ పెయిడ్ విషయానికి వస్తే నెలకు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల అన్ లిమిటెడ్ 5G ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 1.5 GB డేటా ఇచ్చే రూ.299 ప్లాన్ ఉన్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో పేర్కొంది.

ఆఫర్ ప్రయోజనాలు

Advertisement

గూగుల్ అత్యంత పవర్ ఫుల్ ఏఐ మోడల్ జెమిని ప్రో సేవలను ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా గూగుల్ ఫోటోస్, డ్రైవ్, జిమెయిల్ కోసం 2TB భారీ స్టోరేజ్ ను దక్కించుకోవచ్చు. అదే విధంగా గూగుల్ డాక్యుమెంట్, జిమెయిల్ వంటి యాప్స్ లో ఏఐ టూల్స్ సహాయం తీసుకునేందుకు ఈ జియో ప్లాన్స్ అనుమతిస్తాయి. 18 నెలల పాటు అందుబాటులో ఉండే ఈ జెమిని ప్రో సేవల విలువ సుమారు రూ.35,100కు సమానమని జియో వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Vijay Viral Speech: కోడి కత్తి, బాబాయ్ హత్య.. విజయ్ మాట్లాడింది జగన్ గురించేనా? అసలు ఏమన్నారు?

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

Advertisement

సంబంధిత ప్లాన్స్ ను రీఛార్జ్ చేసుకున్న తర్వాత జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్, 2TB స్టోరేజ్ ను పొందేందుకు కొన్ని స్టెప్స్ ను యూజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా మై జియో యాప్ ఓపెన్ చేసి.. హోమ్ స్క్రీన్ పై కనిపించే గూగుల్ జెమిని ఆఫర్ బ్యానర్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ‘Claim Now’పైన క్లిక్ చేసి.. మీ Gmail IDని ఇవ్వాలి. అనంతరం మీ పాస్ వార్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి.. ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Also Read: eSIM vs Physical SIM: రెండింటికి తేడా ఏంటి? నెట్ స్పీడ్, కాల్స్ నాణ్యతకు.. ఏది బెస్ట్ ఛాయిస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×