E-Paper
Advertisement

రైతులు, కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా?

రైతులు, కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా?
Advertisement

PM Maandhan Yojana: రైతులు, అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన. ఈ పథకానికి ఎవరు అర్హులు? రిజిస్ట్రేషన్ ఎలా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా ప్రతినెలా రూ.3 వేల చొప్పున పెన్షన్​ పొందవచ్చు. ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛన్ ప్రయోజనాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, కార్మికులు పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాల కింద పెన్షన్ అందిస్తుంది.

అర్హతలు

  • 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న కార్మికులు, రైతులు అర్హులు
  • భూ రికార్డుల్లో పేరు ఉండి, 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉండాలి.
  • నెల జీతం రూ.15 వేల లోపు ఉన్న అసంఘటిత రంగ కార్మికులు
  • ఈపీఎఫ్‌వో, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌, ఈఎస్‌ఐ, ఇతర సామాజిక భద్రత పథకాల్లో లేని వారు అర్హులు

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్

ఆధార్ కార్డు, ఇ-శ్రమ్ కార్డు, మొబైల్ నెంబర్, నామినీ ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, సాగు భూమి వివరాలు, వయసు నిర్థారణ పత్రాలు, బ్యాంకు పాస్ బుక్

దరఖాస్తు విధానం

Advertisement

ఈ స్కీమ్ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లాలి. అక్కడ ఆపరేటర్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు కూడా మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్​ నింపాల్సి ఉంటుంది. ఫారమ్ పూర్తిచేస్తే CSC ఆపరేటర్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ వివరాలన్నీ కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేస్తారు.

ప్రీమియం వివరాలు

ఈ స్కీమ్ లో చేరిన వారు వయసు ప్రకారం ప్రతి నెలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాలి. 18 ఏళ్లు ఉన్న వారు తన వాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే.. కేంద్రం రూ.55 చెల్లిస్తుంది. వయసును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అర్హులైన సభ్యులు 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న వారు మరణిస్తే.. నామినీకి పెన్షన్ మొత్తంలో సగం అంటే.. రూ.1500 ప్రతి నెలా చెల్లిస్తారు.

Advertisement

Also Read :  ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×