E-Paper
Advertisement

ఎండలు ముదిరినా, కరెంట్ పోయినా ఏం పర్లేదు.. ఈ సోలార్ ఫ్యాన్ ఉంటే రోజంతా చల్లని గాలే!

ఎండలు ముదిరినా, కరెంట్ పోయినా ఏం పర్లేదు.. ఈ సోలార్ ఫ్యాన్ ఉంటే రోజంతా చల్లని గాలే!
Advertisement

Solar Rechargeable Fans: హైదరాబాద్ లాంటి నగరాల్లో సమ్మర్‌లో బయట తిరిగితేనే కాదు.. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతను భరించలేము. దీనికి తోడు అప్పుడప్పుడు పవర్ కట్ సమస్య ఒకటి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఒక పక్క ఉక్కపోతతో అల్లాడిపోతుంటే.. సడన్‌గా కరెంట్ పోతుంది. ఆ సమయంలో వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఇక రాత్రి పూట కరెంటు పోయిందంటే చిన్న పిల్లలు, వృద్ధులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ ‘సోలార్ రీఛార్జబుల్ ఫ్యాన్లు’ అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ సోలార్ ఫ్యాన్ల ధరెంత? వీటి ప్రత్యేకతలు ఏమిటి.. వంటి వివరాలు తెలుసుకుందామా.

సూర్మరశ్మితోనే చల్లని గాలి..

ఈ సోలార్ ఫ్యాన్ల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి ప్రకృతి సిద్ధంగా లభించే సూర్యరశ్మితో నడుస్తాయి. పగటిపూట ఎండలో ఉంచినప్పుడు వీటిలోని సోలార్ ప్యానెల్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇలా స్టోర్ అయిన పవర్‌ను మనం రాత్రి వేళల్లో లేదంటే పవర్ కట్ అయినప్పుడు వాడుకోవచ్చు. ఈ ఫ్యాన్లు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి.. మన అవసరాన్ని బట్టి ఏ గదిలోకైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక ఇవి పర్యావరణానికి మేలు చేస్తూనే.. చల్లదనాన్ని అందిస్తుంటాయి.

Advertisement

Also Read: వావ్, ఏముందీ సోలార్ ఫ్యాన్ హ్యాట్.. ఎండలో తిరిగే వారికి ఏసీ కూలింగ్, ధర కూడా తక్కువే!

అందుబాటులో రకరకాల మోడల్స్..

ప్రస్తుతం మార్కెట్లో మన అవసరాలకు తగ్గట్టుగా బోలెడు బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. సన్ గ్లో కంపెనీకి చెందిన ఏసీ/డీసీ ఫ్యాన్లు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవి దాదాపు 10 గంటల వరకు నిరంతరాయంగా గాలినిస్తాయి. అలాగే సైలెంట్‌గా తిరుగుతూ మంచి గాలినిచ్చే ఇంపెక్స్ బ్రీజ్ సిరీస్ ఫ్యాన్లు కూడా మంచి ఆప్షన్. మీకు ఇంకాస్త పెద్ద ఫ్యాన్ కావాలనుకుంటే.. ఎపిజ్ వంటి 16 అంగుళాల మోడల్స్ ఉన్నాయి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. అమిసి సోలార్ వంటి బ్రాండ్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. గిగావాట్స్ లేదా ఫ్యూచర్‌కార్ట్ వంటి కంపెనీలు అయితే సోలార్ ప్యానెల్, ఫ్యాన్ కలిపి ఒక కంప్లీట్ సెట్‌లాగా వస్తున్నాయి.

ఎక్కడ కొంటే మంచిది?

Advertisement

ఈ సోలార్ రీఛార్జబుల్ ఫ్యాన్లను అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడైతే.. ఇప్పటికే వినియోగించిన వారి రివ్యూలు చూసి మనకు నచ్చిన మోడల్‌ను ఎంచుకునే వీలుంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉండి.. నేరుగా చూసి కొనాలనుకుంటే ట్రూప్ బజార్, సనత్ నగర్ లేదా గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ఎలక్ట్రికల్ షాపులకు వెళ్లొచ్చు. షాపులో కొనేటప్పుడు మనం ఫ్యాన్ క్వాలిటీ, బ్యాటరీ వారంటీ గురించి వివరంగా అడిగి తెలుసుకోవచ్చు. ఇక ధరలు కూడా మనం ఎంచుకునే ఫీచర్లను బట్టి రూ.1800 నుంచి రూ.7,000 వరకు మారుతూ ఉంటాయి.

కొనే ముందు ఇవి చెక్ చేయండి..

సోలార్ ఫ్యాన్ కొనేటప్పుడు ముఖ్యంగా బ్యాకప్ సమయం గురించి అడగాలి. కనీసం 6 నుండి 8 గంటల పాటు పని చేసే ఫ్యాన్ అయితేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మన దగ్గర ఉండే ఎండలకు సోలార్ ప్యానెల్‌ను రోజుకు ఒక 4 గంటలు ఎండలో పెడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది. వర్షాకాలంలో లేదంటే ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా, కరెంట్‌తో కూడా చార్జ్ చేసుకునే సదుపాయం ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: మీ ఏసీ నుంచి ఇలాంటి శబ్దం వస్తోందా? అయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్నట్టే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×