// //
iPhone 17 Pro Max: యాపిల్ ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్. మరి అందులోనూ ‘ప్రో మాక్స్’ మోడల్ అంటే అది ఒక స్టేటస్ సింబల్. 2026లో అత్యంత డిమాండ్ ఉన్న iPhone 17 Pro Max ధర ఇప్పుడు ఊహించని విధంగా తగ్గింది. ముఖ్యంగా ఇండియాలోని ప్రముఖ రిటైల్ స్టోర్ Vijay Salesలో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో iPhone 18 సిరీస్ రాబోతున్న నేపథ్యంలో.. ఈ పాత ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై ఉన్న ప్రస్తుత ఆఫర్ వివరాలు, ఫోన్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
iPhone 17 Pro Max ఇప్పుడు భారీ ఆఫర్‌తో!
మీరు గత కొంతకాలంగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఇండియాలో ఈ ఫోన్ ధర చాలా తగ్గింది. సాధారణంగా దీని లాంచ్ ధర సుమారు రూ.1.49 లక్షలు ఉండగా.. ప్రస్తుత సేల్‌లో భాగంగా అన్నీ ఆఫర్లు కలుపుకుని దీనిని సుమారు రూ. 1.37 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. అంటే నేరుగా మీకు రూ. 12,000 పైగా డిస్కౌంట్ రానుంది.
విజయ్ సేల్స్ ప్రత్యేక ఆఫర్లు & బ్యాంక్ డిస్కౌంట్స్:
విజయ్ సేల్స్ కేవలం ధర తగ్గించడమే కాకుండా.. బ్యాంక్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్: మీరు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొంటే వెంటనే రూ4,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఇతర బ్యాంకులు: ICICI , Axis బ్యాంక్ కార్డులపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.
నో-కాస్ట్ EMI: ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా (No-Cost EMI)వాయిదాలలో కొనే అవకాశం ఉంది. దీని వల్ల మీ జేబుపై భారం పడకుండా ఐఫోన్ మీ చేతికి వస్తుంది.
iPhone 17 Pro Max ఎందుకు అంత స్పెషల్?
ఈ ఫోన్ ధర తగ్గినా.. దీనిలోని ఫీచర్లు మాత్రం నేటికీ అగ్రస్థానంలోనే ఉన్నాయి.
A19 Pro చిప్: యాపిల్ తయారు చేసిన ఈ పవర్‌ఫుల్ చిప్ వల్ల గేమింగ్ , మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మీరు ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ హ్యాంగ్ అస్సలు అవ్వదు.
అద్భుతమైన కెమెరా: 48MP ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ద్వారా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తీసే ఫోటోలు చాలా క్లారిటీతో వస్తాయి.
డిజైన్, డిస్‌ప్లే: మాడర్న్ టైటానియం డిజైన్, సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం లుక్‌లో ఉంటుంది.
బ్యాటరీ లైఫ్: ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం దీనికి మరింత ప్లస్ పాయింట్.
Also Read: 100 ఇంచుల రెడ్ మీ టీవీ వచ్చేసిందోచ్.. ఇక మీ ఇల్లు థియేటర్ అవడం గ్యారంటీ !
iPhone 18 లాంచ్ త్వరలో:
త్వరలో రాబోతున్న iPhone 18 గురించి ఇప్పటికే గాసిప్స్ మొదలయ్యాయి. అందులో కొత్త ప్రాసెసర్ , విప్లవాత్మక మార్పులు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అయితే.. మీరు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు డబ్బు కూడా సేవ్ చేయాలనుకుంటే మాత్రం iPhone 17 Pro Max ఇప్పుడే కొనడం బెస్ట్. ఎందుకంటే కొత్త ఫోన్ లాంచ్ అయినప్పుడు దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పడు ఐఫోన్ 18 ప్రొ ధర కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొనే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా దాని డిమాండ్ కూడా పెరుగుతుంది.
ఈ డీల్ ఎవరికి బెస్ట్?
మీరు ఒక బెస్ట్ ఫ్లాగ్‌షిప్ అనుభవం కావాలనుకుంటే.. బ్రాండ్ వాల్యూతో పాటు పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమనుకుంటే విజయ్ సేల్స్‌లో లభిస్తున్న ఈ రూ. 1.37 లక్షల డీల్ నిజంగా ఒక బంగారు అవకాశం. లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలోని విజయ్ సేల్స్ స్టోర్‌కు వెళ్లడం లేదా వారి వెబ్‌సైట్ విజిట్ చేయడం మంచిది.