E-Paper
Advertisement

Personal Loan Myths: ఉద్యోగం ఉంటేనే లోన్?.. వ్యక్తిగత రుణాలపై అపోహలు

Personal Loan Myths: ఉద్యోగం ఉంటేనే లోన్?.. వ్యక్తిగత రుణాలపై అపోహలు
Advertisement

Personal Loan Myths: అత్యవసర సమయాల్లో పర్సనల్ లోన్ ఆదుకుంటుంది. అతితక్కువ సమయంలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఇది సహాయపడుతుంది. అయితే వ్యక్తిగత రుణాలపై.. ఉద్యోగం ఉంటేనే లోన్ వస్తుంది, ఏదైనా సెక్యూరిటీగా పెట్టాలి.. ఇలాంటి అనేక అపోహలు ఉన్నాయి. కానీ, కొన్ని విషయాలను నేరుగా తెలుసుకుంటేనే.. పూర్తి అవగాహన వస్తుంది. ఇల్లు, కారు, స్థిరాస్తిపై లోన్ తరహాలోనే పర్సనల్ లోన్ కు కూడా బ్యాంకుకు హామీ అవసరమని భావిస్తుంటారు. కానీ వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ అవసరం లేదు. ఈ రుణానికి సెక్యూరిటీగా ఎటువంటి ఆస్తులను పెట్టాల్సిన అవసరం లేదు. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు క్రెడిట్ హిస్టరీ, ఇన్ కమ్, ఉద్యోగ హిస్టరీని పరిగణనలోకి తీసుకుంటాయి.

ఎమర్జెన్సీకి మాత్రమే కాదు

చాలా మంది పర్సనల్ లోన్ ను ఎమర్జెన్సీ టైమ్ లోనే తీసుకోవాలని భావిస్తారు. కానీ, వ్యక్తిగత రుణాలను మరో విధంగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఒకటి కన్నా ఎక్కువ రుణాలంటే.. వాటన్నింటిని ఒకే రుణంగా మార్చుకోవడానికి, విద్యా ఖర్చులు, హాలీడే వెకేషన్‌, ఇంటిని బాగుచేసుకోవడానికి, కుటుంబ వేడుకలు, వైద్య ఖర్చులు, వివిధ కొనుగోళ్లకు..పర్సనల్ లోన్ ఉపయోగించుకోవచ్చు. లోన్ తిరిగి చెల్లించడానికి స్పష్టమైన ప్రణాళిక ఉన్నంత వరకు, వ్యక్తిగత రుణం విలువైన వనరుగా ఉంటుంది.

ఉద్యోగం ఉంటేనే లోన్ ఇస్తారా?

Advertisement

బ్యాంకులు.. ఉద్యోగం చేస్తున్న వారిని మాత్రమే లోన్ ఇస్తాయని అపోహ పడుతుంటారు. మంచి శాలరీ, స్థిరమైన ఉద్యోగం ఉండడం వల్ల కావల్సిన లోన్ మొత్తాన్ని పొందవచ్చు కానీ ఇదొక్కటే లోన్ పొందేందుకు అర్హత కాదు. లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండి, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వ్యాపారులు, కన్సల్టెంట్లు, ఇతరులు కూడా పర్సనల్ లోన్ పొందేందుకు అర్హులు. బ్యాంకులు.. ఈఎంఐ చెల్లింపుల సామర్థ్యం, క్రెడిట్ హిస్టరీ, స్థిరమైన ఆదాయాన్ని అంచనా వేస్తాయి. ఉద్యోగంతో సంబంధం లేకుండా సీనియర్‌ సిటిజన్లు, తగిన ఆదాయం ఉన్న వారు సులభంగా పర్సనల్ లోన్ పొందొచ్చు.

Also Read:  పర్సనల్ లోన్ ఉండగానే వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి ? చట్టం ఏం చెబుతోంది ?

అధిక వడ్డీ రేట్లు

Advertisement

పర్సనల్ లోన్లకు ఎక్కువ వడ్డీ రేటు ఉంటుందనేది ఓ అపోహ మాత్రమే. హోం లోన్, ఎడ్యుకేషన్ లోన్లతో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈఎంఐల పీరియడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ కాలం పాటు అధిక వడ్డీ చెల్లించనక్కర్లేదు. తక్కువ టైమ్ కు తీసుకునే ఈ లోన్ పై 3-4% అధిక వడ్డీ రేటు పెద్ద భారంగా అనిపించదు. క్రెడిట్‌ కార్డుపై తీసుకునే మనీ అడ్వాన్స్‌పై వార్షిక వడ్డీ సుమారు 36% వరకు ఉంటుంది. దీంతో పోల్చి చూస్తే, పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12-14% చాలా తక్కువే. ఈ వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ, ఇన్ కమ్, బ్యాంకుతో మీకుండే రిలేషన్ తో.. లోన్ మంచి ఆఫర్‌ను పొందవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×