E-Paper
Advertisement

Vijaya Nirmala: సీనియర్ నటి విజయనిర్మల మొదటి భర్త ఆయన కాదా..!

Vijaya Nirmala: సీనియర్ నటి విజయనిర్మల మొదటి భర్త ఆయన కాదా..!
Advertisement

Vijaya Nirmala:తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో గొప్ప నటీమణులు ఉన్నారు. కానీ నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా గుర్తింపు పొందినవారిలో విజయనిర్మల ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా ఆమె మొదటి వివాహం గురించి చాలామందికి తెలియదు.

విజయనిర్మల 1946 ఫిబ్రవరి 22న జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుని బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత హీరోయిన్‌గా కూడా మంచి పేరు సంపాదించారు. మొదట ఆమె తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అప్పటికే నిర్మల అనే పేరు ఉన్న మరో నటి ఉండటంతో, ఆమె పేరుకు ముందు విజయ అనే పదం జత చేయడంతో ఆమె విజయనిర్మలగా మారింది.

Advertisement

తర్వాత ఆమె తెలుగులో మంచి కుటుంబం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె, తర్వాత దర్శకురాలిగా మారి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ రికార్డు కూడా సాధించారు.

మొదటి భర్త ఎవరంటే..

విజయనిర్మల వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కీలక మలుపులు ఉన్నాయి. అందరూ విజయనిర్మల మొదటి భర్త కృష్ణ అనుకుంటారు కానీ..ఆమె మొదట కృష్ణమూర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక షిప్ డిజైన్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే తర్వాత ప్రముఖ నటుడైన నరేష్.

Advertisement

అయితే కాలక్రమేణా వారి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయి. ముఖ్యంగా విజయనిర్మల సినిమాల్లో బిజీగా ఉండటం, ఆమె కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కుటుంబ విషయాల్లో కొన్ని విభేదాలు రావడంతో చివరకు వారు విడిపోయారు.

తర్వాత ఆమె నటుడు కృష్ణతో పరిచయం పెంచుకున్నారు. కలిసి సినిమాలు చేయడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, తర్వాత వారు వివాహం చేసుకున్నారు. ఈ విధంగా విజయనిర్మల తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే కృష్ణ కి కూడా పెళ్లయి.. మొదటి భార్యతో పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య పిల్లలే రమేష్, మహేష్ బాబు. ఇక విజయనిర్మలకి మొదటి భర్తతో.. కలిగిన బిడ్డ నరేష్. విజయనిర్మల, కృష్ణకి మాత్రం పిల్లలు లేరు.

ALSO READ: Niharika Konidela: వాళ్లంతా కుక్కలు.. మొరుగుతారంతే.. నిహారిక షాకింగ్ కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×