E-Paper
Advertisement

Inverter AC VS Non Inverter AC: గుడ్డిగా ఏసీ కొనొద్దు.. ఈ తేడా తెలుసుకోండి.. లేదంటే దెబ్బైపోతారు!

Inverter AC VS Non Inverter AC: గుడ్డిగా ఏసీ కొనొద్దు.. ఈ తేడా తెలుసుకోండి.. లేదంటే దెబ్బైపోతారు!
Advertisement

Inverter AC VS Non Inverter AC: సమ్మర్ వచ్చేయడంతో సహజంగానే ఏసీలకు డిమాండ్ ఏర్పడుతుంది. భానుడి తాపం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది పెద్ద ఎత్తున ఏసీలను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఏసీలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా రెండు తేడాలు ఉన్నాయి. ఒకటి ఇన్వర్టర్ ఏసీ కాగా.. మరొకటి నాన్ ఇన్వర్టర్ (నార్మల్) ఏసీ. అయితే రెండింటికి మధ్య తేడా చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.

కూలింగ్, కంప్రెసర్ పరంగా.. 

ఇన్వర్టర్ ఏసీ, నార్మల్ ఏసీ మధ్య ప్రధాన తేడా వాటి కంప్రెసర్ పనిచేసే విధానంలో ఉంటుంది. నార్మల్ ఏసీలోని కంప్రెసర్ కేవలం ఆన్ లేదా ఆఫ్ మోడ్ లో మాత్రమే పనిచేస్తుంది. గది కావాలసినంత చల్లబడగానే.. ఆటోమేటిక్ గా కంప్రెస్ ఆగిపోతుంది. మళ్లీ గది వేడెక్కగానే పూర్తి శక్తితో స్టార్ట్ అవుతుంది. అదే ఇన్వర్టర్ ఏసీ విషయానికి వస్తే.. ఇది వేరియబుల్ స్పీడ్స్ తో పనిచేస్తుంది. గది చల్లబడిన తర్వాత కంప్రెసర్ ఆగిపోదు. కానీ తక్కువ వేగంతో తిరుగుతూ గది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.

విద్యుత్ వినియోగం..

Advertisement

సాధారణ ఏసీల్లో కంప్రెసర్ ప్రతిసారి స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తుంటుంది. దీనవల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశముంది. మరోవైపు ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూ ఉండటం వల్ల (తక్కువ వేగంతో) స్టార్టప్ లోడ్ ఉండదు. కాబట్టి నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే.. 30-50 శాతం వరకూ విద్యుత్ ను ఆదా చేస్తుంది.

గది టెంపరేచర్..

ముందుగా చెప్పుకున్న విధంగా నాన్ ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆన్/ఆఫ్ అవ్వడం వల్ల గది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి గది బాగా చల్లగా ఒక్కోసారి కొంచెం వేడిగా అనిపించవచ్చు. అదే ఇన్వర్టర్ ఏసీ విషయానికి వస్తే… ఇది అత్యంత కచ్చితత్వంతో గది ఉష్ణోగ్రతను మెయిన్ టెన్ చేస్తుంది. దీని వల్ల గది ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు తెలియవు.

తక్కువ శబ్దం.. ఎక్కువ వినియోగం

Advertisement

నార్మల్ ఏసీలోని కంప్రెసర్ మాటిమాటికీ ఆన్/ఆఫ్ అవ్వడం వల్ల శబ్దం ఎక్కువగా వస్తుంటుంది. దీని వల్ల ఏసీ విడిభాగాలు త్వరగా అరిగిపోయే ప్రమాదముంది ఉంది. అయితే ఇన్వర్టర్ ఏసీలో నాయిస్ సమస్య ఉండదు. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కంప్రెసర్‌పై లోడ్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: Air Cooler Tips 2026: కూలర్‌తో ఏసీ రేంజ్ చల్లదనం కావాలా? ఈ 6 చిట్కాలు ఫాలో అయిపోండి!

బడ్జెట్ పరంగా..

బడ్జెట్ పరంగా చూస్తే నాన్ ఇన్వర్టర్ ఏసీలు కాస్త చౌకగా మార్కెట్ లో లభిస్తాయి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రారంభంలో తక్కువ ధరకే ఇవి వచ్చినప్పటికీ విద్యుత్ బిల్లుల రూపంలో వీటి నిర్వహణ ఆర్థికంగా కష్టంగా మారవచ్చు. అదే ఇన్వర్టర్ ఏసీల ధర మార్కెట్ లో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. నిర్వహణ వ్యయం కాస్త తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: Mahalakshmi Smart Cards: మహిళలకు బిగ్ అలర్ట్.. ఫ్రీగా బస్సులో వెళ్లాలంటే.. ఆ కార్డు తప్పనిసరి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×