E-Paper
Advertisement

Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ బాధ్యతల స్వీకారం

Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ బాధ్యతల స్వీకారం
Advertisement

Yellampet Municipality: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ:  ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వామి నాయక్, చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఎల్లంపేట్ మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

Also Read: Priyanka Chopra: బాలీవుడ్ పై ప్రియాంక హాట్ కామెంట్స్.. తొక్కేసే ప్రయత్నాలంటూ!

Advertisement

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద యాదవ్. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి. వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు భూక్య శారద రాజు నాయక్, గుమ్మడిదల మహేశ్వరి రాజేష్, బందెల కుమార్, మాలోత్ రజిత రాజేందర్, నీరుగంటి శ్రీలత రమేష్, గోష్క అఖిల, దుడ్డు కల్పన మాణిక్యరావు, సద్ది సురేష్ రెడ్డి, దాది నర్సింహా, ఓం ప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్, చిన్నోళ్ల భాస్కర్, సద్ది నిషిత రెడ్డి విజయం, వచపల్లి అర్చన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అయితే దంచుడే దంచుడు, పిడుగులు పడే ఛాన్స్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×