// // Sunil Gavaskar: టీ20 అంటే సిక్సులు, ఫోర్లు కొట్ట‌డ‌మే కాదు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Sunil Gavaskar: టీ20 అంటే సిక్సులు, ఫోర్లు కొట్ట‌డ‌మే కాదు..ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడాలి

Sunil Gavaskar: టీ20 అంటే సిక్సులు, ఫోర్లు కొట్ట‌డ‌మే కాదు..ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడాలి
Advertisement

Sunil Gavaskar:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో సూపర్ 8 లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( Team India vs South Africa)  మధ్య జరిగింది. ఇందులో టీమ్ ఇండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణాఫ్రికా. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 76 బరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలవగా… టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పైన తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 క్రికెట్ అంటే సిక్సర్స్, బౌండరీలు కొట్టడం కాదని… ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సునీల్ గవాస్కర్. అనవసరంగా భారీ షాట్లు ఆడబోయి వికెట్ కోల్పోయారని నిప్పులు చెరిగారు. దీంతో టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

టీ20 అంటే సిక్సులు, ఫోర్లు కొట్ట‌డ‌మే కాదు..ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడాలి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా పైన హాట్ కామెంట్స్ చేశారు సునీల్ గవాస్కర్. దక్షిణాఫ్రికా పైన ఆడిన టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిందని నిప్పులు చెరిగారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయిందని చురకలు అంటించారు. ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీ కొట్టాలన్న కసితో టీమిండియా ప్లేయర్లు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలోనే టీమిండియా వికెట్లు కోల్పోయిందని విమర్శలు చేశారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

నిన్న మోడీ స్టేడియం పరిస్థితులను అర్థం చేసుకొని బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియా విజయం సాధించేదని వెల్లడించారు. దక్షిణాఫ్రికా ప్లేయర్లు డేవిడ్ మిల్లర్, స్టబ్స్, బ్రెవిస్ ముగ్గురు కూడా మిడిల్ ఓవర్సులో సింగిల్స్ అవసరమైనప్పుడు బౌండరీ లేదా సిక్సర్ కొట్టి టీమిండియా ముందు మంచి లక్ష్యాన్ని పెట్టారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రయత్నం టీమ్ ఇండియా బ్యాటర్ల నుంచి జరగలేదని ఫైర్ అయ్యారు. టి20 అంటే సిక్సర్, లేదా బౌండరీ అన్న రీతిలో రెచ్చిపోయారని నిప్పులు చెరిగారు. జింబాబ్వేతో అయినా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలని కోరారు. అహంకారాన్ని వదిలి, సాధారణ ఆట తీరును ప్రదర్శించాలని కోరారు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar).

అభిషేక్ శ‌ర్మ‌కు కూడా సూచ‌న‌లు

Advertisement

అభిషేక్ శ‌ర్మ‌కు కూడా సూచ‌న‌లు చేశారు సునీల్ గ‌వాస్క‌ర్‌. ఫ‌స్ట్ ఓవ‌ర్ నుంచి సిక్స‌ర్లు కొట్టడం ఆపేయాల‌ని కోరారు. సింగిల్స్ పైన కూడా దృష్టి పెట్టాల‌న్నారు. కాస్త సెటిల్ అయిన త‌ర్వాత వీర బాదుడు కొన‌సాగించాల‌ని పేర్కొన్నారు.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×