E-Paper
Advertisement

డిజైన్ చూస్తే ఐఫోన్ అనుకుంటారు.. రూ.12,499కే అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Infinix కొత్త స్కెచ్!

డిజైన్ చూస్తే ఐఫోన్ అనుకుంటారు.. రూ.12,499కే అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Infinix కొత్త స్కెచ్!
Advertisement

Infinix Smart 20: మన దేశంలో బడ్జెట్ ధరలో మంచి ఫోన్ల కోసం చూసేవారు చాలా ఎక్కువ. మార్కెట్లో వందల ఆప్షన్లు ఉన్నా.. తక్కువ ధరలో స్టైలిష్‌గా ఉంటూ, కాస్త ఏఐ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం ఇన్ఫినిక్స్ సంస్థ ‘స్మార్ట్ 20’ మోడల్‌ను తీసుకొచ్చింది. రూ.12,499 ధరలో లభించే ఈ ఫోన్ విశేషాలు మీ కోసం..

ప్రీమియం డిజైన్:

ఈ ఫోన్ చేతిలోకి తీసుకోగానే చాలా ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. ముఖ్యంగా ‘సన్‌లైట్ ఆరెంజ్’ కలర్ వేరియంట్ చూడటానికి ఐఫోన్ షేడ్‌ను గుర్తుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం 7.7 మిమీ మందం, 189 గ్రాముల బరువుతో ఇది చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. ఫోన్ వెనుక కెమెరా బంప్ డిజైన్ కూడా బాగుంది. పైగా ధూళి, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఇవ్వడం విశేషం.

డిస్‌ప్లే ఎలా ఉందంటే?

Advertisement

ఇందులో 6.78 ఇంచుల పెద్ద స్క్రీన్‌తో పాటు 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా సాగుతుంది. అయితే, ఎండలో బయటకు వెళ్లినప్పుడు దీని బ్రైట్‌నెస్ కాస్త తక్కువగా అనిపిస్తుంది. స్క్రీన్‌ను కొంచెం పక్కకు తిప్పి చూస్తే రంగులు వెలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఈ బడ్జెట్‌లో ఇంకా మంచి డిస్‌ప్లేలు ఉన్నాయని చెప్పక తప్పదు.

Also Read: కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? ప్రాణాలు తీసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ గురించి తెలుసా?

రోజువారీ వాడకానికి ఫర్వాలేదు:

Advertisement

ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రఫ్ అండ్ టఫ్ బ్రౌజింగ్, చాటింగ్, సోషల్ మీడియా వాడకానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. క్యాజువల్ గేమ్స్ కూడా మీడియం సెట్టింగ్స్‌లో బాగానే ఆడుకోవచ్చు. కానీ ఇందులో 5G కనెక్టివిటీ లేదు. కేవలం 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేటి టెక్ యుగంలో 5G లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.

కెమెరా, ఏఐ మ్యాజిక్:

కెమెరా పనితీరు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందు, వెనుక 8MP కెమెరాలు ఉన్నప్పటికీ.. పగటిపూట ఫొటోలు చాలా స్పష్టంగా, మంచి రంగులతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పాటు దీనిలో ఇచ్చిన సర్కిల్ టు సెర్చ్, ఏఐ రైటర్ వంటి ఫీచర్లు చాలా ఉపయోగపడతాయి. 5200mah బ్యాటరీ ఒక రోజంతా హ్యాపీగా వస్తుంది. అయితే 15 వాట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ ఫుల్ అవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది.

Also Read: అబ్బా ఏం ఆఫర్లు రా బాబు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై ఏకంగా 65 శాతం డిస్కౌంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×