E-Paper
Advertisement

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరాలని వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్‌కు మోస్ట్ అవేటెడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) ఫలితాలు ఇప్పటికే విడుదల అవ్వడంతో.. ఇప్పుడు అందరి కళ్లూ కౌన్సెలింగ్ షెడ్యూల్‌పైనే ఉన్నాయి. ఉన్నత విద్యామండలి త్వరలోనే.. కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించడానికి కసరత్తు పూర్తి చేసింది. అసలు కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వెబ్ ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కౌన్సెలింగ్ ప్రాసెస్:
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లోనే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి.

Advertisement

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు పేమెంట్: ముందుగా.. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి.

సర్టిఫికేట్ వెరిఫికేషన్: చాలా మందికి ఆన్‌లైన్ లోనే.. సర్టిఫికెట్లు వెరిఫై అయిపోతాయి. ఒకవేళ ఏవైనా డాక్యుమెంట్లలో తప్పులు ఉంటే, హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

వెబ్ ఆప్షన్ల నమోదు: ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీకు కావలసిన కాలేజీలు, కోర్సుల లిస్ట్‌ను ప్రాధాన్యత క్రమంలో ఆన్‌లైన్‌లో ఎంచుకోవాలి.

సీట్ల కేటాయింపు : మీ ర్యాంక్, రిజర్వేషన్ , మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా సాఫ్ట్‌వేర్ మీకు సీటును కేటాయిస్తుంది.

ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లు:

కౌన్సెలింగ్ డేట్స్ అనౌన్స్ చేయగానే.. సర్టిఫికెట్ల కోసం పరుగులు పెట్టకుండా, ఇప్పుడే ఈ కింది డాక్యుమెంట్లను ఒక సెట్ జిరాక్స్, ఒరిజినల్స్‌తో సహా రెడీగా ఉంచుకోండి.

AP EAPCET 2026 హాల్ టికెట్ , ర్యాంక్ కార్డ్.

టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో

ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో

6వ తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు

లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం

కుల ధృవీకరణ పత్రం

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

టీసీ, ఆధార్ కార్డ్

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×