E-Paper
Advertisement

గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్.. వామ్మో.. అన్ని వేల డిస్కౌంటా!?

గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్.. వామ్మో.. అన్ని వేల డిస్కౌంటా!?
Advertisement

July 2026 Maruti Nexa Offers: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి జూలై నెల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌ లో గ్రాండ్ విటారా కొనాలనుకుంటున్న వారికి కంపెనీ సూపర్ ఆఫర్లను ప్రకటించింది. కొన్ని వేరియంట్లపై ఏకంగా రూ.95,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం అంటున్నారు ఆటో నిపుణులు.

గ్రాండ్ విటారాపై క్రేజీ డిస్కౌంట్స్

మారుతి సుజుకి జూలై 2026 కోసం నెక్సా శ్రేణిలోని పలు మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో గ్రాండ్ విటారా అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న మోడల్‌గా నిలిచింది. అయితే, అన్ని వేరియంట్లకు ఒకే రకమైన ఆఫర్లు ఉండవు. వేరియంట్‌ ను బట్టి డిస్కౌంట్ మారుతుంది. ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ గ్రాండ్ విటారా సిగ్మా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌పై లభిస్తోంది. ఈ మోడల్‌ పై రూ.95,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అంతేకాదు, డెల్టా పెట్రోల్ వేరియంట్‌ పై రూ.85,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ రెండు వేరియంట్లు ప్రస్తుతం కొనుగోలుదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లు కేవలం క్యాష్ డిస్కౌంట్ కే పరిమితం కాలేదు. నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే అదనపు బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ లాంటి పలు ఆఫర్లను కూడా ఇందులో చేర్చారు. అర్హతను బట్టి కస్టమర్లు వీటిని పొందవచ్చు.

ఇతర మోడల్స్ పైగా ప్రత్యేక ఆఫర్లు

గ్రాండ్ విటారా మాత్రమే కాకుండా, నెక్సా శ్రేణిలోని మరికొన్ని ప్రముఖ మోడళ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఇన్విక్టో, జిమ్నీ, XL6, బాలెనో, ఫ్రాంక్స్ వంటి కార్లపై కూడా వివిధ రకాల డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తుంది. దీంతో ఈ నెలలో నెక్సా షోరూమ్‌లలో కొనుగోలుదారుల సంఖ్య పెంచడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి లేదంటే డీలర్‌షిప్‌ ను బట్టి కొంత మారే అవకాశం ఉంది. అలాగే స్టాక్ అందుబాటులో ఉండటం, వాహనం వేరియంట్, కొనుగోలు చేసే సిటీ లాంటి అంశాలపై కూడా ఫైనల్ డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. అందువల్ల కారు బుక్ చేసుకునే ముందు సమీప నెక్సా డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Advertisement

చాలా రోజులుగా గ్రాండ్ విటారా, ఇతర నెక్సా కారును కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, జూలై నెలలో లభిస్తున్న ఈ ఆఫర్లు ఖర్చును భారీగా తగ్గించే అవకాశం ఉంది. కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్లను పోల్చి చూసి, మీకు సెట్ అయ్యే వేరియంట్‌ ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది.

Read Also: టెక్టన్ కోసం హృతిక్ రోషన్.. నిస్సాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×