E-Paper
Advertisement

Message After Blocked: మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కాంటాక్ట్‌లో బ్లాక్ చేశారా? ఇలా మెసేజ్ చేయండి

Message After Blocked: మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కాంటాక్ట్‌లో బ్లాక్ చేశారా? ఇలా మెసేజ్ చేయండి
Advertisement

Message After Blocked| ఈ రోజుల్లో చాలా మంది తమకు అనవసర కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఫోన్ నెంబర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి అన్ని యాప్‌లలో బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసిన తర్వాత ఆ యాప్‌ల ద్వారా మెసేజ్ పంపడం, కాల్ చేయడం సాధ్యం కాదు. ప్రైవెసీ, భద్రత కోసం బ్లాక్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని సార్లు అత్యవసరంగా వారికి మెసేజ్ చేయాల్సి వస్తే.. అలాంటి సందర్భాల్లో ఒక చిన్న ట్రిక్ ద్వారా ఇప్పటికీ చిన్న మెసేజ్ పంపవచ్చు.

ఎందుకు బ్లాక్ చేస్తారు?

వేధింపులు, అనవసరంగా కాల్స్, మెసేజ్‌లు చేసేవారి కాంటాక్ట్ బ్లాక్ చేస్తారు. వ్యక్తిగతంగా తమ ప్రైవెసీని కాపాడుకోవడానికి కూడా కొందరు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేస్తే మెసేజ్‌లు, కాల్స్, చేయడం.. ప్రొఫైల్ కనిపించడం అన్నీ ఆగిపోతాయి. చాలా మంది బ్లాక్ అంటే పూర్తిగా కాంటాక్ట్ ఆగిపోతుందని భావిస్తారు. సోషల్ మీడియాలో ఇది నిజమే. అయితే ఎన్ని విధాలుగా బ్లాక్ చేసినా.. ఫైనాన్షియల్ యాప్‌లలో ఒక చిన్న మెసేజింగ్ ఆప్షన్ ఇంకా ఉంటుంది.

UPI యాప్‌లతో మెసేజ్ ఎలా పంపాలి?

Advertisement

గూగుల్ ప్లే, ఫోన్‌పే, పేటిఎం, భీమ్ వంటి UPI యాప్‌లలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు నోట్ రాసే ఆప్షన్ ఉంటుంది. ఇది చిన్న టెక్స్ట్ మెసేజ్ లాగా పనిచేస్తుంది. అంటే మిమ్మల్ని మెసేజ్ చేయకుండా బ్లాక్ చేసినా ఈ రూపంలో ఒక చిన్న మెసేజ్ పంపవచ్చు. అయితే ఇలా మెసేజ్ పంపబడానికి ఎదుటి వ్యక్తి కూడా అదే UPI ప్లాట్‌ఫామ్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

మెసేజ్ సెండ్ చేసే స్టెప్స్

ఏదైనా UPI యాప్ ఓపెన్ చేయండి.
పైన ఉన్న సెర్చ్ బార్‌లో వ్యక్తి పేరు లేదా మొబైల్ నంబర్ టైప్ చేయండి.
సరైన ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి.
పే, మెసేజ్ ఆప్షన్లు కనిపిస్తాయి.
మెసేజ్ లేదా నోట్ ఐకాన్ పై ట్యాప్ చేయండి.
టెక్స్ట్ బాక్స్‌లో మీ మెసేజ్ రాయండి.
పేమెంట్ చేయకుండానే సెండ్ చేయండి.
మెసేజ్ ట్రాన్సాక్షన్ స్క్రీన్‌లో కనిపిస్తుంది.

మెసేజ్ పంపిన తర్వాత ఏమవుతుంది?

Advertisement

మెసేజ్ ట్రాన్సాక్షన్ స్క్రీన్‌లో వస్తుంది. రిసీవర్ అంటే బ్లాక్ చేసిన వ్యక్తి వెంటనే చదవగలరు. వారికి నచ్చితే రిప్లై ఇస్తారు లేదా ఇగ్నోర్ చేయవచ్చు. UPI యాప్‌లలో మెసేజ్ నోట్స్‌ను సులభంగా బ్లాక్ చేయలేరు. కాబట్టి ఇది చివరి కమ్యూనికేషన్ మార్గంగా పనిచేస్తుంది. కానీ దీన్ని గౌరవంగా, సరైన కారణంతో మాత్రమే ఉపయోగించాలి.

Also Read: వెబ్‌సైట్ డొమైన్ ధర రూ.600 కోట్లు.. వెంటనే కొనుగోలు చేసిన బడా వ్యాపారవేత్త

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

ఈ మెసేజ్ చాలా చిన్నదిగా రాయాలి. ఇమేజ్‌లు, లాంగ్ టెక్స్ట్ పంపలేం.
కొన్ని యాప్‌లలో మెసేజ్ ఫ్రీక్వెన్సీ లిమిట్ ఉండవచ్చు.
రిసీవర్ UPIలో కూడా మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు.
ప్రైవెసీ, సరిహద్దులను గౌరవించాలి.
వేధించడం కోసం దీన్ని ఉపయోగించకూడదు.

ఈ విధానం సురక్షితం, చట్టపరమేనా?

అవును, UPI మెసేజింగ్ పూర్తిగా లీగల్, అనుమతించబడినది. ఇది పేమెంట్ ఫీచర్‌లో భాగమే. కానీ అవాంఛిత మెసేజ్‌లు రిపీట్ అయితే కంప్లైంట్ చేయవచ్చు. UPI ప్లాట్‌ఫామ్‌లు వేధించేవారిపై ఆంక్షలు విధిస్తాయి. అందుకే బాధ్యతాయుతంగా, ఎథికల్‌గా ఉపయోగించాలి.

ఈ ట్రిక్ ఎప్పుడు ఉపయోగించాలి?

అత్యవసరం లేదా చాలా ముఖ్యమైన మెసేజ్‌లకు మాత్రమే ఉపయోగించండి. ఎమర్జెన్సీలు, ముఖ్యమైన పర్సనల్ మెటర్స్ కోసం మాత్రమే. ఎమోషనల్ ప్రెషర్ కోసం ఉపయోగించకూడదు. మరొకరికి స్పేస్ ఇవ్వడం ముఖ్యం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×