E-Paper
Advertisement

Zombie-comedy OTT : ఇదేందయ్యా ఇదీ… కరిస్తే అక్షరాలా లక్ష… జొంబీకి బంపర్ ఆఫరిచ్చే ఫ్యామిలీ

Zombie-comedy OTT : ఇదేందయ్యా ఇదీ… కరిస్తే అక్షరాలా లక్ష… జొంబీకి బంపర్ ఆఫరిచ్చే ఫ్యామిలీ
Advertisement

Zombie-comedy OTT : జాంబీ సినిమా అనగానే రక్తం తాగే రక్త పిశాచులు, వాటి నుంచి తప్పించుకుంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయే జనాలు కళ్ళముందు మెదులుతారు. కానీ ఈ జానర్ లోనూ కామెడీని ఊహించడం కాస్త కష్టమే. కానీ ఓ డైరెక్టర్ మాత్రం జాంబీ మూవీ లవర్స్ కు ఆ లోటును కూడా తీర్చే ప్రయత్నం చేశారు. మరి ఆ జాంబి కామెడీ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సౌత్ కొరియా మూవీ ‘జాంబీ ఫర్ సేల్’ (Zombie for Sale). ఒరిజినల్ టైటిల్ ‘చుగుక్‌హన్ జాంబీ’. 2019లో విడుదలైన ఈ సౌత్ కొరియన్ జాంబీ కామెడీ-హారర్-డ్రామా సినిమాకు జో జీ-హ్వాన్ దర్శకత్వం వహించారు. జాంబీ జానర్‌ లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక సందేశంతో మిక్స్ చేసిన యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ ఇది. థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Also Read : కొంకణా సేన్ శర్మ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడంటే ?

కథలోకి వెళ్తే…

ఒక చిన్న గ్రామంలో హ్యాంగ్-సూ (జంగ్ యె-జిన్), జూన్-హ్వాన్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు ఇద్దరూ తమ తండ్రి (హీ జిన్-హీ)తో కలిసి ఒక చిన్న ఫార్మసీని నడుపుతారు. ఆ ఫార్మసీ దగ్గర్లోనే ఒక పాత ఫ్యాక్టరీ ఉంటుంది. ఒక రోజు ఆ ఫ్యాక్టరీలో పని చేసే ఒక వృద్ధుడు (కిమ్ జూన్-హ్యుక్) ఓ మందును తాగి జాంబీగా మారిపోతాడు. అతను జాంబీ అయినా కూడా నిజమైన జాంబీలా కాకుండా మామూలు మనిషిలా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, ఆఖరికి ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ అతను కొంచెం బలహీనంగా ఉంటాడు. ముఖ్యంగా సూర్యరశ్మికి భయపడతాడు. మాంసం తినాలని ఆశపడతాడు.

Advertisement

అయితే ఆ బ్రదర్స్ ఈ జాంబీని దాచిపెట్టి, అతని నుంచి ఔషధాన్ని తీసి, దాన్ని విక్రయించాలని అనుకుంటారు. ఈ మందు మనుషులకు బలాన్ని, యవ్వనం ఇస్తుందని తెలుస్తుంది. వాళ్లు దాన్ని “యాంటీ-ఏజింగ్ పిల్”గా మార్కెట్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. కానీ ఈ ప్రయోగం వల్ల చాలా సమస్యలు వస్తాయి. గ్రామస్తులు, పోలీసులు, ఒక బిగ్ కంపెనీ వాళ్లు ఈ ఔషధం గురించి తెలుసుకుంటారు. జాంబీగా మారిన వృద్ధుడు కూడా తన కుటుంబం, గత జీవితం గురించి బాధ పడతాడు. జాంబీగా మారిన వృద్ధుడు తన కుమార్తెను కలవాలని ఆశపడటం వంటి సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. మరి ఆ జాంబీ ఏం చేసింది ? ఆ అన్నదమ్ములు ఆ జాంబీతో చివరికి ఎలాంటి పని చేశారు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×