E-Paper
Advertisement

BSNL Jio Airtel eSIM: భారత్‌లో eSIM ఎలా ఉపయోగించాలి? జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఎలా పనిచేస్తుంది?

BSNL Jio Airtel eSIM: భారత్‌లో eSIM ఎలా ఉపయోగించాలి? జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఎలా పనిచేస్తుంది?
Advertisement

Jio Airtel BSNL eSIM| డిజిటల్ టెక్నాలజీతో ఇప్పుడు ఫిజికల్ సిమ్ (సాధారణ సిమ్) కాకుండా వర్చువల్ సిమ్ (eSIM) కూడా ఉపయోగించవచ్చు. ఈ డిజిటల్ సిమ్ ఫిజికల్ సిమ్ లాగానే పని చేస్తుంది. కానీ ఫోన్‌లో ఫిజికల్‌గా పెట్టాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేయాలి. ఐఫోన్, శాంసంగ్, గూగుల్, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో eSIM సపోర్ట్ ఉంది. ఒక ఫిజికల్ సిమ్, ఒక eSIM కలిపి డ్యూయల్ సిమ్‌గా కూడా ఉపయోగించవచ్చు.

eSIMలో ప్రత్యేకత ఏమిటి?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం.. eSIM అంటే డిజిటల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఫోన్ సెట్టింగ్స్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేస్తారు. సిమ్ స్లాట్ అవసరం లేదు. ఇండియాలో ఎయిర్‌టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, Vi వంటి టెలికాం కంపెనీలు eSIM సర్వీస్ ఇస్తున్నాయి. QR కోడ్ స్కాన్ చేసి సులభంగా యాక్టివేట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సర్వీస్ పని చేస్తుంది.

eSIM ప్రయోజనాలు

Advertisement

eSIM ఫిజికల్ సిమ్ లాగా డ్యామేజ్ కాదు, స్క్రాచ్ అయ్యే అవకాశాలు లేవు. ఫోన్ లోపలే సురక్షితంగా ఉంటుంది. కానీ ఫోన్ మార్చినప్పుడు eSIMను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయలేము. కొత్త యాక్టివేషన్ అవసరం. పొరపాటున డిలీట్ చేస్తే సర్వీస్ వెంటనే ఆగిపోతుంది. మళ్లీ అప్లై చేయాలి.

eSIM ఉపయోగించడానికి అవసరాలు

ముందుగా మీ ఫోన్ eSIM సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. పాత ఫోన్లలో సపోర్ట్ ఉండదు. KYC వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఐడెంటిటీ వెరిఫై చేసిన తర్వాతే eSIM ఇస్తారు.

భారత్‌లో eSIM కోసం ఎలా అప్లై చేయాలి?

Advertisement

జియో యూజర్లు ‘MyJio’ యాప్ ద్వారా లేదా జియో స్టోర్‌లో అప్లై చేయవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు ఎయిర్‌టెల్ యాప్ లేదా కస్టమర్ కేర్ సెంటర్‌లో అప్లై చేయవచ్చు. వొడాఫోన్ యూజర్లు Vi యాప్ లేదా సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయవచ్చు. బిఎస్ఎన్ఎల్ యూజర్లు కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి అప్లై చేయాలి. BSNLలో పూర్తి ఆన్‌లైన్ యాక్టివేషన్ అందుబాటులో లేదు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ సెట్టింగ్.. ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్ చూపించవచ్చు.. ఇలా చేయండి

QR కోడ్ ద్వారా eSIM ఎలా యాక్టివేట్ చేయాలి?

అప్రూవల్ అయిన తర్వాత ఈమెయిల్ ద్వారా QR కోడ్ వస్తుంది. ఫోన్ సెట్టింగ్స్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌కు వెళ్లి Add eSIM లేదా Download eSIM ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. QR కోడ్ స్కాన్ చేస్తే ఆటోమాటిక్‌గా యాక్టివేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. IVR కాల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. 4 గంటల వరకు సమయం పట్టవచ్చు. యాక్టివేషన్ పూర్తయ్యాక ఫిజికల్ సిమ్ నెట్‌వర్క్ ఆగిపోతుంది. కొత్త eSIM కనెక్షన్ యాక్టివ్ అవుతుంది.

eSIM టెక్నాలజీ ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. మీ నెట్‌వర్క్ eSIM కోసం జారీ చేసే సూచనలు జాగ్రత్తగా ఫాలో చేస్తే సమస్యలు రావు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×