E-Paper
Advertisement

Emergency Fund Rule: ఎమర్జెన్సీ ఫండ్ కోసం.. 10-5-3 రూల్ తో ఇన్వెస్ట్మెంట్ ఇలా?

Emergency Fund Rule: ఎమర్జెన్సీ ఫండ్ కోసం.. 10-5-3 రూల్ తో ఇన్వెస్ట్మెంట్ ఇలా?
Advertisement

Emergency Fund Rule: అనుకోకుండా వచ్చే ఆర్థిక ఇబ్బందుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ను ప్లాన్ చేసుకుంటాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే సాధారణంగా 3 నెలల ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం. కానీ ఒక్కోసారి ఉద్యోగం పోయి, ఇంటి ఖర్చులు, ఇంట్లో ఎవరైనా హాస్పిటల్ లో చేరితే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇందుకు మూడు నెలల ఎమర్జెన్సీ ఫండ్ సరిపోకపోవచ్చు. ఇందుకోసం 10-5-3 రూల్ ఫాలో అయితే ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా పరిష్కరించుకోవచ్చు.

10-5-3 రూల్ ప్రాసెస్

ఇందులో మొట్ట మొదటిది 10.. అంటే 10 నెలల ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని సేవ్ చేసుకోవడం. ఓటీటీ, రెస్టారెంట్, మూవీ ఖర్చులు కాకుండా.. ఏవైతే అత్యవసరం అవుతాయో… వాటికి డబ్బు సేవ్ చేసుకోండి. ఎందుకు 10 నెలల గ్యాప్ అంటే.. ఒక్కోసారి ఉద్యోగం పోయిన తర్వాత లాంగ్ గ్యాప్ వస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కాస్త టైమ్ పడుతుంది. తర్వాత 5.. అంటే మనం క్రియేట్ చేసుకునే ఈ ఫండ్.. ఎమర్జెన్సీ అవసరాల కోసం. ఎమర్జెన్సీ అంటే 5 రోజుల్లోగా డబ్బులు తీసుకునే వీలుంటేనే అందులో ఇన్వెస్ట్ చేయాలి.

రెండు మూడు రోజుల్లో

Advertisement

ఇక చివరిది 3 అంటే మీ డబ్బులను మూడు భాగాలు చేయండి. మొదటి భాగం 30-40 శాతం డబ్బులను సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే..వీటిల్లో అదే రోజు విత్ డ్రా చేసుకోవచ్చు. రెండో భాగం 20-30 శాతం మొత్తాన్ని.. లిక్విడ్ ఫండ్ లేదా ఓవర్ నైట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ రోజు నైట్ రిక్వెస్ట్ చేస్తే రేపు అకౌంట్ లో డబ్బులు పడేలా ఉండాలి. చివరి భాగం 30-40 శాతం మొత్తాన్ని అల్ట్రా సార్ట్ టర్మ్ ఫండ్స్ లేదా ఆర్బిట్రరీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడి టైమ్ పీరియడ్ రెండు నుంచి మూడు రోజుల్లోపు ఉంటుంది.

ఎప్పుడూ కూడా క్రిప్టో కరెన్సీ, ఫండ్స్ డబుల్ అవుతాయి అనే వాటిల్లో ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టకూడదు. ఎమర్జెన్సీ అంటే ఆ సమస్యను పరిష్కరించేలా ఉండాలి కానీ, డబ్బులు గురించి ఆలోచించేలా ఉండకూడదు.

Advertisement

Also Read:  రూ.13 లక్షల పెట్టుబడితో రూ.9 కోట్ల రాబడి.. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇలా?

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×