E-Paper
Advertisement

పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?
Advertisement

HMD Blackberry Style Phone: నోస్టాల్జియా ఫీలింగ్‌ను అందిస్తూ సరికొత్త ఫోన్లను పరిచయం చేయడంలో హెచ్ఎండీ (HMD) గ్లోబల్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఈ సంస్థ క్లాసిక్ బ్లాక్‌బెర్రీ ఫోన్ల డిజైన్‌ను తలపించేలా ఒక సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్ స్కెచ్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

అద్భుతమైన ఫ్లిప్ డిజైన్:

లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ గుండ్రటి అంచులతో, కాంపాక్ట్ సైజులో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. దీనిలో సాంప్రదాయ T9 కీప్యాడ్‌తో పాటు ఫ్లిప్ డిజైన్‌ను అందించడం విశేషం. అంతేకాదు.. ఈ ఫ్లిప్ స్క్రీన్ టచ్ సపోర్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం. అంటే యూజర్లు అటు ఫిజికల్ కీస్ వాడుతూనే, ఇటు టచ్ స్క్రీన్ అనుభూతిని కూడా పొందవచ్చు.

Advertisement

Also Read: శీతాకాలం వచ్చేస్తోంది.. కరెంట్ బిల్లు తక్కువ వచ్చే టాప్-7 బెస్ట్ గీజర్లు ఇవే, ధర కూడా బడ్జెట్‌లోనే!

స్మార్ట్ ఫీచర్లు.. లైట్ ఆపరేటింగ్ సిస్టమ్:

సాధారణ ఫీచర్ ఫోన్ల కంటే స్మార్ట్‌గా, అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ల లాగా తలనొప్పి లేకుండా ఉండేలా హెచ్ఎండీ దీనిని రూపొందిస్తోంది. ఇది RTOS టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనివల్ల క్లౌడ్ ఫోన్ సర్వీసెస్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చాట్, న్యూస్, వెదర్, వీడియో స్ట్రీమింగ్ వంటి బ్రౌజర్ ఆధారిత యాప్స్‌ను సులభంగా వాడుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్ అదిరిపోతుంది:

Advertisement

ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ.. దీనిలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల బ్యాటరీ ఎక్కువ గంటల పాటు వస్తుంది. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఫోన్ వాడుకోవాలనుకునే వారికి, అలాగే సెకండరీ డివైజ్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

హెచ్ఎండీ భవిష్యత్తు వ్యూహాలు:

కనెక్టివిటీ, ఏఐ అసిస్టెన్స్, యాక్సెసిబిలిటీ వంటి ఫీచర్లతో ఫీచర్ ఫోన్ల ప్రపంచాన్ని మార్చేయాలని హెచ్ఎండీ లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీకి దూరంగా ఉండే సామాన్యులకు కూడా ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తేవాలనే కంపెనీ ఆలోచనకు తగ్గట్లే ఈ సరికొత్త మిస్టరీ ఫ్లిప్ ఫోన్ రూపుదిద్దుకుంటోంది.

Also Read: ఈ సరికొత్త Xiaomi TV అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చూసాక.. సాధారణ LED TV కొనాలనిపించదు.. ఎందుకంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×