E-Paper
Advertisement

New York: విమానాన్ని ఢీ కొట్టిన డ్రోన్.. చివరకు ఏమైంది?

New York: విమానాన్ని ఢీ కొట్టిన డ్రోన్.. చివరకు ఏమైంది?
Advertisement

New York: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు డ్రోన్ల యుగం నడుస్తోంది. పార్టీ, ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఇలా చూసినా వెరైటీ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కోసారి అది ప్రమాదాలను తెచ్చిపెడుతుంది కూడా. సరిగ్గా అమెరికాలో అదే జరిగింది. ఓ డ్రోన్ నేరుగా వెళ్లి విమానాన్ని ఢీ కొట్టింది. చివరకు ఏమైంది?

న్యూయార్క్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో  విమానాన్ని ఢీ కొట్టిన డ్రోన్

Advertisement

అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అక్కడి కాలమాన ప్రకారం ఈ ఉదయం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌ బ్లూ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానాన్ని న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టులో దిగేందుకు రెడీ అవుతోంది. ఈలోగా విమానాశ్రయ సమీపంలో డ్రోన్‌.. ఆ విమానాన్ని ఢీ కొట్టింది.

లాస్‌ వెగాస్‌ నుంచి వస్తున్న జెట్ బ్లూ విమానం భూమికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన కాక్‌పిట్‌ బయట భాగాన్ని డ్రోన్‌ బలంగా తాకింది. ఈ విషయాన్ని పైలట్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌‌కు తెలిపాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

ఘటన సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులు

చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ విషయాన్ని జెట్‌ బ్లూ ఏయిర్‌లైన్స్‌ స్వయంగా వెల్లడించింది. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు మొదలుపెట్టింది. ఎయిర్ పోర్టు పరిసరాల్లో ప్రతి నెలా 100 డ్రోన్లను గుర్తిస్తున్నామని ఎయిర్ పోర్టు అథారిటీ చెబుతోంది. నిషేధిత గగనతలంలో ఎగరవేస్తే లైసెన్స్‌ రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎఫ్‌ఏఏ.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×