E-Paper
Advertisement

Hotel Room Spy Cameras: హోటల్ రూమ్‌లలో రహస్య కెమెరాలు.. ఎక్కడ దాచి పెట్టారో సులభంగా పసిగట్టండిలా

Hotel Room Spy Cameras: హోటల్ రూమ్‌లలో రహస్య కెమెరాలు.. ఎక్కడ దాచి పెట్టారో సులభంగా పసిగట్టండిలా
Advertisement

Identify Spy Cameras Hotel Rooms| ప్రయాణ సమయంలో అందరూ హోటల్స్, హాస్టెల్స్ లేదా పిజి (పెయింగ్ గెస్ట్) ఇళ్లలో బస చేస్తారు. మంచి బ్రాండ్ ఉన్న హోటల్స్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ వచ్చే అతిథుల ప్రైవసీని గౌరవిస్తారు. కానీ కొన్ని హోటల్స్‌లో మోసపూరితంగా అతిథులు బస చేసే గదుల్లో రహస్య కెమెరాల పెట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని వీడియోలు రికార్డ్ చేస్తారు. ఆ తరువాత ఆ వీడియోలను దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి సంఘటనలు ప్రైవసీపై భయాన్ని కలిగిస్తాయి. ఇదంతా హోటల్ రూమ్స్‌లో దాచి పెట్టిన కెమెరాల ద్వారానే జరుగుతుంది. అందుకే మీరు ఏదైనా హోటల్ రూంలో బస చేస్తే ముందుగా ఆ గదిని బాగా పరిశీలించాలి. ఆ రహస్య కెమెరాలు ఎక్కడైనా దాగి ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

రహస్య కెమెరాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి

ఈ రహస్య కెమెరాలు హోటల్ గదిలోని సాధారణ వస్తువుల్లో మోసగాళ్లు దాచి పెడతారు. గదిలోని అలారం గడియారాలు, వాల్ ఛార్జర్లు, USB అడాప్టర్లు, స్మోక్ డిటెక్టర్లు వస్తువుల్లో వంటివి సాధారణ హైడింగ్ స్పాట్స్. ఎయిర్ ప్యూరిఫైయర్లు, టీవీ సెట్-టాప్ బాక్స్‌లు, బాత్‌రూమ్ వెంటిలేషన్, పవర్ సాకెట్లలో కూడా ఉండవచ్చు. ఇవన్నీ చూస్తే సాధారణ వస్తువుల్లాగానే కనిపిస్తాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి.

గదిని పూర్తిగా తనిఖీ చేయండి

Advertisement

రూమ్‌లోకి వెళ్లగానే బ్యాగేజ్ ఓపెన్ చేయకండి. కొన్ని నిమిషాలు చుట్టూ గమనించండి. అసాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలు, కొత్త వస్తువులు ఉన్నాయేమో చూడండి. బెడ్ లేదా బాత్‌రూమ్ వైపు పాయింట్ అయ్యే పరికరాలు ఉంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. సందేహాస్పదంగా అనిపిస్తే వెంటనే వాటిని పరిశీలించండి.

నెట్‌వర్క్ స్కానింగ్ టూల్స్ ఉపయోగించండి

టెక్నాలజీ సహాయంతో కూడా తనిఖీ చేయవచ్చు. Fing అనే యాప్ చాలా పాపులర్. ఈ యాప్‌లో మీరు కనెక్ట్ అయిన వై-ఫై నెట్‌వర్క్‌లో ఉన్న అన్ని డివైస్‌లను చూపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ లభిస్తుంది.

Fing యాప్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ముందుగా హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వండి. స్మార్ట్‌ఫోన్‌లో Fing యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేయండి. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, రౌటర్లు కనిపిస్తాయి. కొన్ని IP కెమెరాలుగా లేదా సెక్యూరిటీ కెమెరాలుగా చూపిస్తాయి. తెలియని డివైస్ కనిపిస్తే జాగ్రత్తగా చూడండి. అనుమానంగా అనిపిస్తే వెంటనే హోటల్ స్టాఫ్‌కు చెప్పండి. (ఇది వై-ఫై కనెక్టెడ్ కెమెరాలకు మాత్రమే పనిచేస్తుంది)

ఫోన్ లేదా నెట్‌వర్క్ లేకుంటే ఇలా తనిఖీ చేయండి

ఇంటర్నెట్ లేదా, స్మార్ట్‌ఫోన్ లేకున్నా సాధారణంగా కూడా తనిఖీ చేయవచ్చు. స్మోక్ డిటెక్టర్లు, పవర్ సాకెట్లు, బాత్‌రూమ్ వెంట్స్, ముఖ్యంగా డెకరేషన్ చేసిన వస్తువులు బాగా పరిశీలించండి. రూమ్ లైట్స్ ఆఫ్ చేసి టార్చ్ లైట్ లేదా మీ ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో గది అన్ని వైపులా చూడండి. ఏదైనా వస్తువులోపల రహస్యంగా కెమెరా ఉంటే కెమెరా లెన్స్‌లు లైట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.

ఫోన్ కెమెరాతో కూడా చెక్ చేయొచ్చు

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఓపెన్ చేసి రూమ్ స్లోగా స్కాన్ చేయండి. నైట్-విజన్ కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ లైట్స్ ఉపయోగిస్తాయి. అవి స్క్రీన్‌పై చిన్న గ్లోయింగ్ డాట్స్‌గా కనిపిస్తాయి. చీకటిగా ఉన్న గది మూలలు, ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర బాగా చూడండి.

అద్దాల వద్ద జాగ్రత్తగా తనిఖీ చేయండి

కొన్ని అద్దాలు టూ-వే మిర్రర్లు కావచ్చు. వేలితో అద్దంపై టచ్ చేయండి. మీ వేలి రిఫ్లెక్షన్ నేరుగా టచ్ అయితే అందులో తేడా ఉన్నట్లే. సాధారణ అద్దాల్లో చిన్న గ్యాప్ ఉంటుంది.

Also Read: యుపిఐ చెల్లింపుల సమయంలో మీ నెంబర్ కనిపిస్తోందా? బ్లాక్ చేయడానికి ఇలా చేయండి

హోటల్స్‌లో సేఫ్‌గా ఉండే చిట్కాలు

నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే రూమ్ బుక్ చేయండి. మంచి రేటింగ్స్ ఉన్న హోటల్స్ ఎంచుకోండి. తెలియని పబ్లిక్ వై-ఫైకి కనెక్ట్ మీ ఫోన్ చేయడం ప్రమాదకరం. మొబైల్ డేటా ఉపయోగించండి. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే హోటల్ స్టాఫ్‌కు చెప్పండి. అవసరమైతే రూమ్ మార్చమని అడగండి. హోటల్ సిబ్బందిపై కూడా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ ప్రైవసీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×