// // Haier P7 Pro Smart TV: హైయర్ నుంచి సరికొత్త Gemini AI స్మార్ట్ టీవీలు! -->
E-Paper
Advertisement

థియేటర్ లాంటి సౌండ్, AI ఫీచర్లతో హైయర్ HQLED P7 ప్రో టీవీలు లాంచ్.. ప్రారంభ ధర ఎంతంటే?

థియేటర్ లాంటి సౌండ్, AI ఫీచర్లతో హైయర్ HQLED P7 ప్రో టీవీలు లాంచ్.. ప్రారంభ ధర ఎంతంటే?
Advertisement

Haier P7 Pro Smart TV: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైయర్ (Haier) భారత మార్కెట్లోకి సరికొత్త HQLED P7 ప్రో స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తూ అదిరిపోయే ఫీచర్లతో ఈ టీవీలను తీసుకొచ్చింది. 43 ఇంచుల నుంచి 75 ఇంచుల వరకు మొత్తం ఐదు స్క్రీన్ సైజుల్లో ఇవి లభిస్తున్నాయి. ఈ సరికొత్త స్మార్ట్ టీవీల ప్రత్యేకతలు, ధరలపై ఓ లుక్కేద్దాం రండి..

కేక పెట్టించే డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీల్లో హైయర్ సరికొత్త HQLED డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించింది. ఇది రంగులను చాలా స్పష్టంగా, సహజంగా చూపిస్తుంది. ముఖ్యంగా 55 ఇంచులు, అంతకంటే పెద్ద మోడల్స్‌లో డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎక్కువ సమయం టీవీ చూసినా కళ్లు అలసిపోకుండా ఉండేందుకు వీలుగా దీనిలో TUV లైట్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు.

థియేటర్ లాంటి సౌండ్:

Advertisement

సినిమా చూసేటప్పుడు విజువల్స్ ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే ముఖ్యం. అందుకే హైయర్ ఈ సిరీస్‌లో 50W పవర్ ఫుల్ ఆడియో సిస్టమ్‌ను అందించింది. 55 ఇంచుల పైబడిన మోడల్స్‌లో ప్రత్యేకంగా సబ్‌వూఫర్ కూడా వస్తుంది. దీనికి డాల్బీ అట్మోస్ సౌండ్ తోడవడంతో ఇంట్లోనే థియేటర్ లాంటి బేస్, సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: నెక్ట్స్ జనరేషన్ ప్రాసెసర్‌తో Oppo Foldable Phone.. లీకైన వివరాలు చూస్తే వావ్ అనాల్సిందే!

గూగుల్ టీవీతో పాటు జెమిని AI సపోర్ట్:

Advertisement

ఈ స్మార్ట్ టీవీలు గూగుల్ టీవీ ఆధారంగా పనిచేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో గూగుల్ జెమిని AI ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. దీనివల్ల రిమోట్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత పిక్చర్ క్వాలిటీని, రంగులను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసి బెస్ట్ విజువల్స్‌ను అందిస్తుంది.

గేమర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు:

కన్సోల్, పిసి గేమర్ల కోసం ఈ టీవీల్లో ప్రత్యేక ఫీచర్లను జోడించారు. 120Hz రిఫ్రెష్ రేట్, MEMC, VRR వంటి ఫీచర్ల వల్ల గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. గేమింగ్ సెట్టింగ్స్‌ను సులువుగా మార్చుకోవడానికి ‘గేమింగ్ బార్’ కూడా ఉంది. అలాగే ఇందులో 2GB RAM, 32GB స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర, వారంటీ వివరాలు:

భారతదేశంలో ఈ టీవీల ధరలు రూ.35,990 (43-ఇంచ్) నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ (75-ఇంచ్) రూ.90,990 వరకు ఉన్నాయి. ఇవి అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల నమ్మకం కోసం హైయర్ ఈ టీవీలపై ఏకంగా మూడేళ్ల వారంటీని కూడా అందిస్తోంది.

Also Read: మీరు ఏ పాట విన్నారో, ఏం మాట్లాడారో గుర్తుంచుకునే Pixel AI ఫీచర్.. మరి ప్రైవసీ సంగతేంటి?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×