E-Paper
Advertisement

లాంచ్‌కు ముందే లీకైన Samsung Galaxy Watch 9.. ఈసారి క్లాసిక్ వేరియంట్ లేనట్లేనా?

లాంచ్‌కు ముందే లీకైన Samsung Galaxy Watch 9.. ఈసారి క్లాసిక్ వేరియంట్ లేనట్లేనా?
Advertisement

Samsung Smartwatches: శాంసంగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Galaxy Unpacked 2026 ఈవెంట్ వచ్చే నెలలో లండన్‌లో జరగనుంది. ఈ వేదికపై కొత్త ఫోల్డబుల్ ఫోన్లతో పాటు సరికొత్త Galaxy Watch 9, Galaxy Watch Ultra 2 స్మార్ట్‌వాచ్‌లు సందడి చేయనున్నాయి. అయితే అధికారికంగా లాంచ్ అవ్వడానికి ముందే, వీటికి సంబంధించిన డిజైన్, కలర్స్, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సరికొత్తగా ఆల్ట్రా లుక్:

లీకైన వివరాల ప్రకారం.. ఈసారి Galaxy Watch Ultra 2 సరికొత్త బాక్సీ డిజైన్‌తో రానుంది. క్లాసిక్ మోడల్స్ లాగే బెజెల్‌పై 1 నుండి 12 వరకు నెంబర్ మార్కింగ్స్ ఉండనున్నాయి. డిస్‌ప్లే చుట్టూ బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. అంతేకాదు.. సైడ్ బటన్స్ లేఅవుట్‌ను కూడా మార్చారు. హోమ్, బ్యాక్ బటన్స్ మధ్యలో ఉండే క్విక్ బటన్‌కు ఈసారి పూర్తిగా కాకుండా, కేవలం అంచులకు మాత్రమే ఆరెంజ్ కలర్ కోటింగ్ ఇచ్చారు.

Advertisement

Also Read: 11000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో Honor X80 Pro Max లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

ఆకర్షణీయమైన రంగులు:

ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లు బ్లాక్, సిల్వర్, బేజ్ కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి. ఇందులో బేజ్ కలర్ కేవలం స్టాండర్డ్ వాచ్ 9 మోడల్‌కు మాత్రమే పరిమితం కానుంది. ఇక బ్లాక్ కలర్ వాచ్‌కు బ్లూ షేడ్ ఉన్న స్ట్రాప్, సిల్వర్ కలర్ వాచ్‌కు గ్రీన్ కలర్ స్ట్రాప్ జోడించనున్నారు. అయితే ఈ ఏడాది ‘క్లాసిక్’ వేరియంట్‌ను శాంసంగ్ విడుదల చేయడం లేదని సమాచారం. రెండింటి స్ట్రాప్స్ డిజైన్ దాదాపు ఒకేలా ఉన్నా, హోల్స్ అమరికలో చిన్న మార్పులు ఉన్నాయి.

అప్‌గ్రేడెడ్ సాఫ్ట్‌వేర్:

Advertisement

ఈ వాచ్‌లు One UI 9 వాచ్ అప్‌డేట్‌తో పనిచేస్తాయి. ఇందులో సరికొత్త వాచ్ ఫేస్ పికర్‌తో పాటు రీడిజైన్ చేసిన శాంసంగ్ హెల్త్ యాప్ అందుబాటులోకి రానుంది. సిస్టమ్ యాప్స్ ఐకాన్లు కూడా సరికొత్త 3D స్టైల్‌లో కనిపించనున్నాయి. కాంపాస్ యాప్‌లో కొత్త బటన్ డిజైన్ ఎలా పనిచేస్తుందో లీకైన చిత్రాలు చూపిస్తున్నాయి.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ:

ఈ స్మార్ట్‌వాచ్‌లలో శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా ఈసీజీ (ECG) లాంటి అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లను యూజర్లు వాడుకోవచ్చు. జూలై 22న జరగబోయే అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ రెండు అద్భుతమైన వాచ్‌లు అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి.

Also Read: థియేటర్ లాంటి సౌండ్, AI ఫీచర్లతో హైయర్ HQLED P7 ప్రో టీవీలు లాంచ్.. ప్రారంభ ధర ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×