// // Buy Digital Gold| ఒక్క వారంలో రూ.11000 తగ్గిన బంగారం ధర.. ఆన్‌లైన్ గోల్డ్ కొనడానికి బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవే -->
E-Paper
Advertisement

Buy Digital Gold: ఒక్క వారంలో రూ.11000 తగ్గిన బంగారం ధర.. ఆన్‌లైన్ గోల్డ్ కొనడానికి బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవే

Buy Digital Gold: ఒక్క వారంలో రూ.11000 తగ్గిన బంగారం ధర.. ఆన్‌లైన్ గోల్డ్ కొనడానికి బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవే
Advertisement

Buy Digital Gold| గత ఏడు రోజులుగా బంగారం ధరలు చాలా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.11,000 వరకు క్షీణించింది. ఇప్పుడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.51 లక్షలు ఉంది. గత వారం ఇదే 10 గ్రాము లధర రూ.1.62 లక్షల వరకు ఉండేది. ఇరాన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ నష్టాలు లాంటి ఇతర కారణాల వల్ల మార్కెట్లు ప్రభావితమయ్యాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనడానికి మంచి అవకాశంగా చూస్తున్నారు. ఇంటి నుంచే సులభంగా బంగారం కొనాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?

డిజిటల్ గోల్డ్ అనేది ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే పద్ధతి. డిజిటల్‌గా బంగారం కొనవచ్చు, సేల్ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు. కంపెనీలు మీ తరపున ఫిజికల్ బంగారాన్ని స్టోర్ చేస్తాయి. ఇది 99.99 శాతం ప్యూర్ బంగారం. ఎప్పుడైనా అమ్మవచ్చు లేదా రిడీమ్ చేసుకోవచ్చు. MMTC-PAMP, SafeGold, Augmont వంటి ప్రముఖ కంపెనీలు బంగారం ఆన్‌లైన్ లో సేల్ చేస్తాయి. అలాగే చాలా యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో బంగారం క్రయవిక్రయాలు చేసే సౌలభ్యం ఉంది.

ఆన్‌లైన్‌లో బంగారం కొనడం ప్రయోజనాలు

Advertisement

ఆన్‌లైన్‌లో బంగారం కొనడం చాలా సౌకర్యవంతం. షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేకింగ్ చార్జీలు ఉండవు. చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు. మొబైల్ యాప్‌ల ద్వారా త్వరగా కొనవచ్చు. ఎప్పుడైనా అమ్మడానికి వీలుంటుంది.

ఫోన్‌పేలో బంగారం ఎలా కొనాలి?

ఫోన్‌పే యాప్‌లో సులభంగా బంగారం కొనవచ్చు. యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై గోల్డ్ ఉత్సవ్ బ్యానర్‌పై ట్యాప్ చేయండి. ఎంత మొత్తం లేదా బరువు కావాలో ఎంచుకోండి. పేమెంట్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయండి. కొన్న బంగారం వెంటనే మీ అకౌంట్‌లో కనిపిస్తుంది.

పేటీఎంలో బంగారం ఎలా కొనాలి?

Advertisement

పేటీఎం యాప్‌లో కూడా సులభంగా కొనవచ్చు. యాప్ ఓపెన్ చేసి సెర్చ్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. ‘గోల్డ్’ సెర్చ్ చేసి పేటీఎం గోల్డ్ ఎంచుకోండి. లైవ్ ధరలు చూడవచ్చు. రోజూ సేవ్ చేయాలా లేక ఒకేసారి కొనాలా ఎంచుకోండి. మొత్తం ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయండి. అవసరమైతే ఫిజికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు.

గూగుల్ పేలో బంగారం ఎలా కొనాలి

గూగుల్ పే యూజర్లు కూడా సులభంగా కొనవచ్చు. యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో ‘గోల్డ్ లాకర్’ సెర్చ్ చేయండి. ‘బై గోల్డ్’ ఎంచుకోండి. ఎన్ని గ్రాములు కావాలో ఎంచుకొని UPIతో పేమెంట్ చేయండి. బంగారం మీ డిజిటల్ లాకర్‌లో నిల్వ ఉంటుంది.

ఆన్‌లైన్‌లో టాటా తనిష్క్ బంగారం సేల్స్

భారతదేశంలో నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్. అధికారిక తనిష్క్ యాప్‌లో డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. SafeGold బ్యాకింగ్‌తో సురక్షితంగా ఉంటుంది. ఫిజికల్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు. ఇది చాలా నమ్మదగిన ఆప్షన్.

కొనుగోలు చేసే ముందు ఇవి చూడండి

నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఎంచుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చదవండి. ప్యూరిటీ సర్టిఫికెట్ చూడండి. స్టోరేజ్, డెలివరీ పాలసీలు తెలుసుకోండి. సురక్షిత పేమెంట్ మెథడ్స్ ఉపయోగించండి.

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

SEBI హెచ్చరిక

SEBI డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్ గురించి హెచ్చరిక జారీ చేసింది. ఇవి SEBI నియంత్రణలో లేవు. సెక్యూరిటీస్ లేదా కమోడిటీ డెరివేటివ్స్ కావు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌లతో ఆకర్షిస్తాయి. రిస్క్‌లు తెలుసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.

బంగారం ధరల తగ్గుదల కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం. డిజిటల్ గోల్డ్ ఆధునిక ఇన్వెస్టర్లకు సౌకర్యం, సౌలభ్యం ఇస్తుంది. అయితే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో జాగ్రత్త అవసరం. నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లు ఎంచుకుని, రిస్క్‌లు అర్థం చేసుకుని మాత్రమే కొనండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×