E-Paper
Advertisement

Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కఠినం.. ఏకంగా మూడు గంటలు, ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి

Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కఠినం.. ఏకంగా మూడు గంటలు, ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి
Advertisement

Driving License New Rules: రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. చనిపోతున్నవారిలో ఎక్కువగా యువకులు అధికంగా ఉన్నట్లు క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలామంది వచ్చి రాని డ్రైవింగ్‌తో ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దేశంలో దాదాపు 1.7 లక్షల మంది ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ కఠినతరం

Advertisement

తెలంగాణలో ఏటా దాదాపు 7 వేల చనిపోతున్నారు. గాయపడిన బాధితుల సంఖ్య దీనికి మూడు రెట్లు. అంతే దాదాపు 23 వేల మంది గాయపడుతున్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ కొద్దినెలల కిందట సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ రవాణాశాఖ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే విధానంలో పలు మార్పులు చేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.

ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్‌ పరీక్ష పేరిట రెండంచెల విధానం అమల్లో ఉంది. దీనికి అదనంగా ఆన్‌లైన్‌ రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ మాడ్యూల్స్‌ టెస్ట్‌ చేసేందుకు రెడీ అవుతోంది.  ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ నుంచి ప్రవేశపెట్టనుంది. ఈ లెక్కన ఎల్‌ఎల్‌ఆర్‌కు చేసుకునే ముందు ఆన్‌లైన్‌ రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ మాడ్యూల్‌ టెస్ట్ తప్పనిసరి.

Advertisement

ఇకపై మూడోసారి ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి, ఏకంగా మూడు గంటలు

కొత్త నిబంధన ప్రకారం ఎల్ఎల్ఆర్ కోసం అభ్యర్థులు మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు వినాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌లో చేసే చిన్న పొరపాట్లు ఎలా ప్రాణాంతకంగా మారతాయో వీడియో ద్వారా వివరిస్తారు. దాని తర్వాత కెమెరా ఉన్న కంప్యూటర్ లేకుంటే ల్యాప్‌టాప్ పరీక్ష ఇంటి నుంచి కూడా రాయవచ్చు. అందులో అర్హత సాధించిన తర్వాత LLR స్లాట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది.

ఇంతకీ టెస్టు ఎలా ఉండబోతోందని అసలు ప్రశ్న. రోడ్‌ సేఫ్టీ టెస్ట్‌లో మొత్తం ఆరు మాడ్యూళ్లు ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాలపాటు ఉంటుంది. డ్రైవింగ్‌పై అవగాహన, శిక్షణతో కూడిన పరీక్ష. టెస్ట్‌లో యదార్థంగా జరిగిన ప్రమాదాలు, డ్రైవింగ్‌లో చేసే పొరపాట్లను వీడియోల రూపంలో చూపిస్తుంది. రోడ్డుపైకి వాహనంతో ఎలా వెళ్లాలి? ముందు వెళ్తున్న వాహనాలను ఏ విధంగా ఓవర్‌టేక్‌ చేయాలి? వాటిపై అవగాహన కల్పిస్తారు.

ALSO READ: ట్యాక్స్ కలెక్షన్‌పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!

ప్రమాదాలు జరిగే సమయంలో బాధితులకు జరిగే నష్టం, ఆయా కుటుంబాలపై ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను అందులో వివరిస్తారు. కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకునేవారు అలాంటి తప్పులు చేయకుండా ఉండేలా ప్రతి మాడ్యూల్‌కు చిన్న పరీక్ష ఉంటుంది. మొత్తానికి కాబోయే కొత్త డ్రైవర్లకు కొద్దిగా కష్టంగానే ఉంటుందని చెబుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×