E-Paper
Advertisement

రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి
Advertisement

ESTOR Avenzo BLDC fan review: వేసవి కాలంలో లేదా రోజంతా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే .. నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లు చూసి షాక్ అవ్వాల్సిందే! అయితే ఇప్పుడు పాత మోడల్ ఫ్యాన్లకు స్వస్తి చెప్పి, కరెంట్ ఆదా చేసే BLDC ఫ్యాన్ల వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం GESTOR Avenzo BLDC Ceiling Fan ఒక సూపర్ ఆప్షన్. కేవలం రూ. 1,710 కే లభించే ఈ 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్ లో ఉన్న ఫీచర్లు, వారంటీ, కరెంట్ ఎంత ఆదా అవుతుందో ఇప్పుడు ట్రెండీగా చూద్దాం!

GESTOR Avenzo BLDC Ceiling Fan రివ్యూ:

మన ఇంట్లో అత్యధికంగా.. వాడే ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీలింగ్ ఫ్యాన్ ఒకటి. సాధారణ ఫ్యాన్లు ఎక్కువ కరెంట్ ఖర్చు ఎక్కువవుతుంది. కానీ BLDCటెక్నాలజీతో వచ్చే ఫ్యాన్లు కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తాయి. ఈ కేటగిరీలో ఈ ఫ్యాన్ బడ్జెట్ ధరలో లభిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

స్మార్ట్ BLDC మోటార్ & కరెంట్ పొదుపు:

Advertisement

ఈ ఫ్యాన్ లో లేటెస్ట్ 5-స్టార్ రేటెడ్ BLDC మోటార్ ఉపయోగించారు. పాతకాలపు సాధారణ ఫ్యాన్లు 75W వరకు కరెంట్ తీసుకుంటే, ఈ ఫ్యాన్ కేవలం 28W నుంచి 30W మాత్రమే వాడుకుంటుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం మీ కరెంట్ బిల్లులో వేలాది రూపాయలు ఆదా అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కొన్ని నెలల్లోనే ఈ ఫ్యాన్ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది!

రిమోట్ కంట్రోల్ & సైలెంట్ ఆపరేషన్:

ఇక స్విచ్ బోర్డ్ దాకా వెళ్లే పనిలేకుండా దీనితో పాటు స్మార్ట్ రిమోట్ లభిస్తుంది. పడుకున్న చోటు నుంచే ఫ్యాన్ స్పీడ్ మార్చుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు లేదా బూస్ట్ మోడ్ ఆన్ చేయవచ్చు. చాలా ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు ‘గయ్యి’ అని శబ్దం చేస్తాయి. కానీ ఇందులో సైలెంట్ ఆపరేషన్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల ఫ్యాన్ చాలా నిశ్శబ్దంగా తిరుగుతూ.. ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.

యాంటీ డస్ట్ డిజైన్ & ప్రీమియం లుక్:4

Advertisement

ఈ ఫ్యాన్ ‘స్మోక్డ్ బ్రౌన్’ కలర్‌లో చాలా క్లాసీ డిజైన్‌తో వస్తుంది. ఇది మీ గది అలసిపోని అందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా.. దీని బ్లేడ్స్‌పై ప్రత్యేకమైన ఆంటీ డస్ట్ కోటింగ్ ఉంది. దీని వల్ల ఫ్యాన్ పై దుమ్ము త్వరగా పేరుకుపోదు, కాబట్టి పదే పదే తుడవాల్సిన అవసరం ఉండదు.

Also Read: రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

సూపర్ హై స్పీడ్ గాలి:

తక్కువ కరెంట్ తీసుకుంటుంది కదా అని గాలి తక్కువ వస్తుందేమో అని అనుకుంటే పొరపాటే! 1200 mm (48 ఇంచ్) విస్తరణ కలిగిన బ్లేడ్స్ వల్ల గదిలోని ప్రతి మూలకు వేగంగా గాలి వీస్తుంది. హై స్పీడ్ ఎయిర్ డెలివరీ వల్ల వేడి వాతావరణంలో కూడా గది క్షణాల్లో చల్లబడుతుంది.

5 సంవత్సరాల వారంటీ:

సాధారణంగా బడ్జెట్ ఫ్యాన్లకు 1 లేదా 2 ఏళ్ల వారంటీ ఇస్తారు. కానీ GESTOR సంస్థ తమ ఈ మోడల్‌పై ఏకంగా 5 ఏళ్ల వారంటీ అందిస్తోంది. అంటే ఐదేళ్ల పాటు మోటార్ లో ఎలాంటి సమస్య వచ్చినా కంపెనీ బాధ్యత వహిస్తుంది. బ్రాండ్ నమ్మకానికి ఇది ఒక పెద్ద నిదర్శనం.

మీరు రూ. 2,000 లోపు బడ్జెట్‌లో కరెంట్ ఆదా చేసే బెస్ట్ BLDC ఫ్యాన్ కోసం వెతుకుతుంటే GESTOR Avenzo పర్ఫెక్ట్ ఛాయిస్. రిమోట్ సౌకర్యం, యాంటీ డస్ట్ కోటింగ్, సైలెంట్ ఆపరేషన్ , 5 ఏళ్ల వారంటీతో వస్తున్న ఈ ఫ్యాన్ ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×