E-Paper
Advertisement

ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!

ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!
Advertisement

Facebook: నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలోని విశేషాలను, ప్రత్యేక క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ అందించే Stories ఫీచర్‌కు చాలా ప్రాజాదరణ ఉంది. దీని ద్వారా ఫొటోలు, వీడియోలను 24 గంటల పాటు తాత్కాలికంగా ఇతరులతో పంచుకోవచ్చు. అయితే, ఒక్కోసారి మనం అనుకోకుండా లేదా పొరపాటున వేరే ఫొటోనో, వీడియోనో స్టోరీగా పోస్ట్ చేసేస్తుంటాం. అలాంటి సమయంలో కంగారు పడకుండా చిటికెలో డిలీట్ చేసే ట్రిక్‌ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫేస్‌బుక్ స్టోరీస్ ఎలా పనిచేస్తాయి?

ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Add to Your Story ఆప్షన్ ద్వారా నేరుగా కెమెరాతో ఫొటో తీసి పెట్టవచ్చు. లేదా ఫోన్ గ్యాలరీలో ఉన్న పాత ఫొటోలు, వీడియోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ప్రొఫైల్‌లో శాశ్వతంగా ఉండే పోస్టుల కంటే ఇవి చాలా వేగంగా ఇతరులకు రీచ్ అవుతాయి.

Advertisement

Also Read: 7400mAh బ్యాటరీ, 8000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో iQOO 15 Ultra గ్లోబల్ లాంచ్‌కి రెడీ!

ఫేస్‌బుక్, మెసెంజర్ అనుసంధానం:

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫేస్‌బుక్, మెసెంజర్ రెండూ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే.. మనం ఫేస్‌బుక్‌లో పెట్టిన స్టోరీ మెసెంజర్‌లో కూడా కనిపిస్తుంది. అలాగే మనం ఫేస్‌బుక్ నుంచి ఏదైనా స్టోరీని తొలగిస్తే.. అది మెసెంజర్ నుంచి కూడా వెంటనే తొలగిపోతుంది. కాబట్టి.. రెండింటిలో విడివిడిగా డిలీట్ చేయాల్సిన పనిలేదు.

స్టోరీని సులువుగా ఎలా డిలీట్ చేయాలి?

Advertisement

పొరపాటున అప్‌లోడ్ చేసిన స్టోరీని తీసేయడం చాలా సులభం. ముందుగా ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేసి, పైన ఉన్న మీ స్టోరీపై క్లిక్ చేయండి. మీరు తొలగించాలనుకుంటున్న ఫొటో లేదా వీడియో స్క్రీన్ పైకి వచ్చాక, పైన కుడి వైపున ఉండే మూడు చుక్కల (Menu) గుర్తుపై ట్యాప్ చేయండి. అక్కడ మీకు Delete ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుని, ఓకే అని కన్ఫర్మ్ చేస్తే చాలు. ఆ ఫొటో లేదా వీడియో వెంటనే తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల సోషల్ మీడియాను ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రశాంతంగా, మనకు కావలసిన విధంగా ఉపయోగించుకోవచ్చు.

Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. అత్యంత ఖరీదైన ఫోన్‌గా iPhone 18 Pro Max?!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×