E-Paper
Advertisement

ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు

ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు
Advertisement

Amaravati: దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో నేతలను అలర్ట్ చేశారు. ఏ మాత్రం ఏమరుపాటు వద్దని తేల్చిచెప్పారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. ఈ నేపథ్యంలో నేతలకు 45 రోజులపాటు టాస్క్ ఇచ్చారు.

నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్-పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో అమరావతి నుంచి సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండేళ్ల కూటమి పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్ల పాలనపై సోమవారం నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టనున్న తెలిపారు.

Advertisement

కూటమిదే విజయం- గడచిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని అన్నారు. సీట్లల్లో 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించామని తెలిపారు. టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో మంచి మెజార్టీలు సాధించామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు.

నేతలకు కొత్త టాస్క్-  ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేస్తున్నామని, నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు. టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తేల్చిచెప్పారు. బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ హెదాల్లో పని చేసినవారు బాధ్యతతో పని చేయాలన్నారు.

Advertisement

కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలని, ప్రజలు-కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలన్నారు. నాకు కావాల్సింది అనుచరులు కాదని,  పార్టీకి నాయకులు కావాలన్నారు. సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలని తేల్చిచెప్పారు. ముఖ్యంగా లీడర్ షిప్ క్వాలిటీ పెంచుకోవాలన్నారు.

అదే ఫార్ములా ఫాలోకావాలన్నారు-ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి ఎలా ప్రచారం చేశామో, అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించాలన్నారు. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వెంటనే వాటిని నివృత్తి చేయాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం అంతా అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కానీ ఏమరుపాటు వద్దన్నారు. రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ప్రభుత్వం, చేస్తున్న పనులు, పథకాల గురించి వివరించాలన్నారు. యువత భవితకు, వాళ్ల ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ALSO READ: వైఎస్ షర్మిలకు ఆపరేషన్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్, అన్నయ్య వచ్చారా?

డబ్బులున్నాయని ధీమాతో ఎలాగైనా గెలుస్తామని గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ వ్యవహరించిందని అన్నారు. కేవలం డబ్బులతో ప్రజాభిమానాన్ని పొందలేరన్నారు. 2024 ఎన్నికలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించాలన్నారు. గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్దతులను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.

ఘోర ఓటమి చెందినా, ఇప్పటికీ సమాజంలో చిచ్చును రాజేస్తోందని, గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజలతో నిత్యం ఇంటరాక్ట్ అయితే గొడ్డలి పార్టీ కుట్రలను ఎక్స్ పోజ్ చేయవచ్చని, ఈ విషయం అగ్ర స్థాయి మొదలు క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుందన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×