E-Paper
Advertisement

AI Jewellery: స్మార్ట్‌బ్యాండ్, స్మార్ట్‌రింగ్ తరహాలో ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఆభరణాలు.. వీటిని ధరిస్తే ఏమవుతుందంటే

AI Jewellery: స్మార్ట్‌బ్యాండ్, స్మార్ట్‌రింగ్ తరహాలో ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఆభరణాలు.. వీటిని ధరిస్తే ఏమవుతుందంటే
Advertisement

CES 2026 Smart AI Jewellery| అమెరికాలో జరుగుతున్న CES 2026 టెక్నాలజీ మేళాలో టెక్ కంపెనీల ప్రదర్శిస్తున్న తమ విన్నూత్న ప్రొడక్ట్స్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. CES 2026 టెక్ మేళాలో కొన్ని గాడ్జెట్స్ హైలైట్ అవుతున్నాయి. వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్మార్ట్ జువెలరీ అంటే ఏఐ టెక్నాలజీ కలిగిన ఆభరణాలు.

టెక్ మేళాలో నిర్వా కంపెనీ కొత్త రకం స్మార్ట్ ఆభరణాలను లాంచ్ చేసింది. ఇవి సాధారణ ఫిట్‌నెస్ లేదా ఆరోగ్య ట్రాకింగ్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇవి మానవ భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాలను అర్థం చేసుకుంటాయి.

నిర్వా- నెక్లెస్, బ్రేస్‌లెట్ డిజైన్

Advertisement

నిర్వా కంపెనీ స్మార్ట్ నెక్లెస్, స్మార్ట్ బ్రేస్‌లెట్ ప్రదర్శించింది. ఇవి చాలా అందమైన డిజైన్‌తో, ప్రీమియం ఆభరణాల్లా కనిపిస్తాయి. వీటిని మెడలో లేదా చేతికి సులభంగా ధరించవచ్చు. ఇవి టెక్నాలజీని ఫ్యాషన్‌తో మేళవించాయి. వీటిని చూస్తే అసలు గాడ్జెట్‌లా కనిపించవు. పైగా వీటికి IP67 రేటింగ్‌ కూడా ఉంది. దుమ్ము, నీటి చినుకులు పడినా ఇవి డ్యామేజ్ కావు.

ఆభరణాల్లో సెన్సార్లు, హార్డ్‌వేర్ ఫీచర్లు

ఈ రెండు పరికరాల్లో రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. UV లైట్, సెన్సార్ మోషన్ డిటెక్షన్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇవి రోజంతా మీ కదలికలు, చుట్టుపక్కల వాతావరణం, సంభాషణలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. డేటాను సురక్షితంగా నిల్వ చేస్తాయి. నిర్వా ప్రత్యేక ఛార్జింగ్ బాక్స్ ఇస్తుంది. 90 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఒక్క ఛార్జ్‌తో రెండు రోజుల వరకు బ్యాటరీ ఉంటుంది.

నిర్వా స్మార్ట్ ఆభరణాలు ఎలా పని చేస్తాయి?

Advertisement

నెక్లెస్, బ్రేస్‌లెట్ మీ రోజువారీ సంభాషణలను నిశ్శబ్దంగా వింటాయి. సాధారణ సంభాషణల్లో ఇబ్బంది కలిగించవు. తర్వాత నిర్వా మొబైల్ యాప్‌లో ఈ ఇన్‌సైట్స్ చూడవచ్చు. యాప్‌లో జర్నల్ ఎంట్రీలు చేయవచ్చు. బుక్‌మార్క్‌లు, లొకేషన్, ఆరోగ్యం.. క్యాలెండర్ డేటా జోడించవచ్చు. వివిధ వ్యక్తులతో గడిపిన సమయం, సంభాషణ టోన్ భావోద్వేగ నమూనాలను అధ్యయనం చేస్తుంది. రోజువారీ మూడ్ లాగ్‌ను సృష్టిస్తుంది.

Also Read: స్పాటిఫై కొత్త ఫీచర్ తెలుసా.. మీ ఫ్రెండ్ ఏ పాటు వింటున్నాడో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే

AI ఆధారిత భావోద్వేగ ఇన్‌సైట్స్

నిర్వా AI మీ భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ట్రిగ్గర్‌లను గుర్తిస్తుంది. మూడ్‌పై ప్రతికూలంగా లేదా సానుకూలంగా పని చేసే అలవాట్లు లేదా సంభాషణలను చూపిస్తుంది. సంబంధాల్లో స్ట్రెస్ నమూనాలను గుర్తిస్తుంది. భావోద్వేగ బ్యాలెన్స్ తగ్గితే అలర్ట్ ఇస్తుంది. భావోద్వేగ మెరుగుదలకు సూచనలు ఇస్తుంది. సానుకూల ఫీడ్‌బ్యాక్, ఆలోచనాత్మక జీవనశైలి సలహాలు ఇస్తుంది. ఈ డివైజ్ ఏవిధమైన నిర్ణయాలు తీసుకోదు. కేవలం భావోద్వేగ అవగాహనను పెంచుతుంది.

స్మార్ట్ జువెలరీ అందుబాటు, లాంచ్ టైమ్‌లైన్
నిర్వా ఫిబ్రవరి 2026లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభిస్తుంది. ఉత్పత్తుల డెలివరీలు 2026 మధ్యలో మొదలవుతాయి. అధికారిక ధరలు ఇంకా వెల్లడించలేదు.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×