E-Paper
Advertisement

Gujarat: సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు.. త్రిశూలంతో ప్రధాని మోదీ.. అబ్బురపరిచిన డ్రోన్‌ షో

Gujarat: సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు.. త్రిశూలంతో ప్రధాని మోదీ.. అబ్బురపరిచిన డ్రోన్‌ షో
Advertisement

Gujarat: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర‌మోదీ. పూజలు తర్వాత ఓంకార జపంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిశూలం పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో అక్కడి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుగులేని విధంగా డ్రోన్ల షో సాగిందని చెబుతున్నారు.

సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు

Advertisement

Advertisement

శనివారం రాత్రి గుజరాత్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం సోమ్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. సోమ్‌నాథ్‌ మందిరంపై తొలి దాడి జరిగి వెయ్యేళ్లు అయిన సందర్భంగా స్వాభిమాన్‌ పర్వ్‌లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని, ఆ తర్వాత ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో దేశవ్యాప్తంగా వందలాది మంది సాధువులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో 72 గంటల పాటు ‘ఓం’ మంత్ర జపం జరిగింది. ఈ నేపథ్యంలో సోమనాథ్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక డ్రోన్‌ షోను ప్రధాని వీక్షించారు.

అబ్బుర పరిచిన డ్రోన్ల కార్యక్రమం, తిలకించిన ప్రధాని మోదీ

అందుకోసం దాదాపు మూడు వేల డ్రోన్‌లను వినియోగించారు నిర్వాహకులు. ముఖ్యంగా శివుడి లింగాకారం,  ఆ తర్వాత త్రిశూలం, నక్షత్ర మండలం వంటివి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికితోడు శివుడి శివతాండవంతోపాటు రకరకాలుగా ఈ డ్రోన్ షో సాగింది.

1026 జనవరిలో మహ్మద్‌ ఘజని సోమనాథ్ దేవాలయంపై జరిపిన దాడి సందర్భంగా స్వాభిమాన్‌ పర్వ్‌ పేరిట కార్యక్రమం ఈనెల 11 అంటే ఆదివారం వరకు జరగనుంది. సోమ్‌నాథ్‌ ఆలయాన్ని కాపాడే క్రమంలో ప్రాణ త్యాగం చేసినవారిని స్మరించుకుంటూ శౌర్య యాత్రలో పాల్గొంటారు. ఆదివారం 108 గుర్రాలతో శౌర్య యాత్ర జరగనుంది. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఈ యాత్ర మొదలుకానుంది.

ALSO READ:  అయోధ్య రామమందిరంలో కాశ్మీర్ యువకుడు హల్చల్  

అందులో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11 గంటల సమయంలో స్వాభిమాన్‌ పర్వ్ కార్యక్రమానికి హాజరవుతారు. శతాబ్దాలుగా సోమనాథ్ ఆలయ విధ్వంసం కోసం అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ ఆలయం చెక్కు చెదరలేదు.

స్వాతంత్య్రం తర్వాత ఆలయ పునరుద్ధరణకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అంతా ఇంతా కాదు. 1951 లో అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పూజలు చేసి భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×