// // BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు! -->
E-Paper
Advertisement

BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు.. ఓటీటీ కూడా ఫ్రీ!

BSNL సంచలనం.. కేవలం రూ. 61లకే 1000+ లైవ్ టీవీ ఛానళ్లు.. ఓటీటీ కూడా ఫ్రీ!
Advertisement

BSNL Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ.. బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోతుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండేలా అత్యంత చౌకైన ‘సినిమా ప్లస్’ (Cinema Plus) ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 61కే భారీ వినోదాన్ని కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.

‘సినిమా ప్లస్’ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ (FTTH) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీని రూపొందించింది. సాధారణంగా వేర్వేరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం చాలా మంది వందల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ ‘స్టార్టర్ ప్యాక్’ పేరుతో తెచ్చిన ఈ రూ.61 ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం కంటెంట్‌ను పొందే అవకాశం లభించనుంది.

1000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు

Advertisement

ఈ ప్లాన్ కింద 1000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించే అవకాశం యూజర్ కు లభిస్తుంది. వార్తలు, క్రీడలు, వినోదం, ఆధ్యాత్మిక ఛానళ్లతో పాటు అనేక ప్రాంతీయ ఛానళ్లను కూడా బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కస్టమర్లు ఎంజాయ్ చేయెుచ్చు. టీవీ సబ్‌స్క్రిప్షన్ కోసం అదనంగా ఏమాత్రం ఖర్చు చేయనవసరం లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీల్లో వీటిని చూడొచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

ఒక్క ప్లాన్.. మరెన్నో ఓటీటీలు

రూ. 61 ప్లాన్ టీవీ ఛానళ్లను మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను సైతం ఆఫర్ చేస్తోంది. షీమారూ మీ, హంగామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలోని వేలాది సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది.

Advertisement

Also Read: ఇంటిపైన నీటి కుండలు.. తర్వాత జరిగే అద్భుతం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా!

ఈ ప్లాన్ ఎవరి కోసమంటే?

ప్రస్తుతానికి ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ లోని భారత్ ఫైబర్ (FTTH) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌కు ఈ సినిమా ప్లస్ ప్యాక్‌ను యాడ్ ఆన్ (Add on) గా జోడించి బెనిఫిట్స్ పొందొచ్చు. ఒకవేళ మరిన్ని ఓటీటీలు కోరుకుంటే.. రూ. 199, రూ. 249 వంటి యాడ్ ఆన్ ఓటీటీ ప్లాన్‌లను కూడా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఫైనల్గా తక్కువ బడ్జెట్‌లో ఇంటిల్లిపాదికి వినోదం కోరుకునేవారికి బీఎస్ఎన్ఎల్ రూ. 61 ప్లాన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

Also Read: కేంద్రం సంచలనం.. త్వరలో కొత్త గోల్డ్ పాలసీ.. ఇంట్లోని బంగారంపై వడ్డీ చెల్లింపు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×