E-Paper
Advertisement

రూ.5వేలతో ప్రీ బుకింగ్.. శామ్‌సంగ్ ఏఐ టీవీలపై ఊహించని డిస్కౌంట్

రూ.5వేలతో ప్రీ బుకింగ్.. శామ్‌సంగ్ ఏఐ టీవీలపై ఊహించని డిస్కౌంట్
Advertisement

Samsung Vision AI TV 2026: టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గ్లోబల్ టీవీ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూనే ఉంది. వరుసగా 20 ఏళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ టీవీ బ్రాండ్‌గా నిలిచిన శామ్‌సంగ్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలోకి మరో అడుగు వేసింది. తన సరికొత్త ‘2026 విజన్ AI’ టీవీ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం ఇప్పుడే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కస్టమర్లు భారీ డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది. అసలు ఈ టీవీల్లో ఉన్న ప్రత్యేకతలేంటి? ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

శామ్‌సంగ్ విజన్ ఏఐ టీవీ(Samsung Vision AI TV ):

శామ్‌సంగ్ 2026 విజన్ ఏఐ టీవీలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు. మీ ఇంటిని ఒక స్మార్ట్ హోమ్‌గా మార్చేందుకు రూపొందించారు. ఇందులో ప్రవేశపెట్టిన ‘విజన్ ఏఐ కంపానియన్’ (Vision AI Companion) ఫీచర్ టీవీ చూసే ఫీల్ పూర్తిగా మార్చేస్తుంది.

Advertisement

ప్రీ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలు :
మీరు ఈ కొత్త సిరీస్ టీవీలను కొనాలని అనుకుంటే, మే 26 లోపు రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది.

డిస్కౌంట్ ఆఫర్: ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్లు కొన్ని మోడళ్లపై రూ. 10వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Advertisement

ఎలా రిజిస్టర్ చేయాలి: శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ (Samsung.com) లో లేదా ప్రముఖ రిటైల్ స్టోర్లలో మీ వివరాలను ఎంటర్ చేసుకోవచ్చు.

ఏ ఏ ఫీచర్లు ఉంటాయి?
శామ్‌సంగ్ తన 4K UHD, అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న అన్ని టీవీలలోనూ ఈ విజన్ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. గతంలో కేవలం ప్రీమియం మోడళ్లకే పరిమితమైన ఏఐ ఫీచర్లు, ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో కూడా లభించనున్నాయి. రకరకాల స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు రాబోతున్నాయి.

విజన్ AI టీవీల ప్రత్యేకతలు:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ టీవీలు మనం చూసే కంటెంట్‌ను స్మార్ట్‌గా చేస్తాయి.

Also Read: మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు

AI పిక్చర్ క్వాలిటీ: సాధారణ వీడియోలను కూడా ఏఐ సహాయంతో 4K నాణ్యతలోకి మార్చి చూపిస్తుంది. రంగులు, బ్రైట్‌నెస్‌ను గదిలోని వెలుతురును బట్టి టీవీనే స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది.

విజన్ ఏఐ కంపానియన్: ఇది మీ పర్సనల్ అసిస్టెంట్ పనిచేస్తుంది. మీ అలవాట్లకు అనుగుణంగా మీకు నచ్చిన షోలను సజెస్ట్ చేయడం, మీ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్లను టీవీ ద్వారానే నియంత్రించడం వంటివి చేస్తుంది.

లార్జ్ స్క్రీన్ ఇన్నోవేషన్: సినిమా థియేటర్ ఫీల్ ఇంట్లోనే అందించేలా పెద్ద స్క్రీన్ సైజులలో కూడా ఈ టెక్నాలజీని శామ్‌సంగ్ యాడ్ చేసింది.

ధర: ప్రస్తుతానికి శామ్‌సంగ్ ఈ టీవీల పూర్తి స్పెసిఫికేషన్లు లేదా కచ్చితమైన ధరలను వెల్లడించలేదు. అయితే.. ఈ నెలాఖరులో జరిగే లాంచ్ ఈవెంట్‌లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. శామ్‌సంగ్ గ్లోబల్ మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ఏఐ టీవీలే కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

మీరు పాత టీవీని మార్చాలనుకున్నా లేదా కొత్తగా ఒక స్మార్ట్ టీవీని కొనాలనుకున్నా.. శామ్‌సంగ్ 2026 విజన్ ఏఐ టీవీల కోసం చూడటం బెస్ట్. ఇందుకోసం మే 26 లోపు రిజిస్టర్ చేసుకుని భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×