E-Paper
Advertisement

షోరూమ్‌లో AC నచ్చిందని వెంటనే కొనేయొద్దు.. ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకున్నాకే ముందుకెళ్లండి!

షోరూమ్‌లో AC నచ్చిందని వెంటనే కొనేయొద్దు.. ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకున్నాకే ముందుకెళ్లండి!
Advertisement

1.5 Ton AC Tips: రోజురోజుకీ ఎండలు ముదురుతుండటంతో ప్రతి ఇంట్లోనూ AC వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఏసీ కొనుగోలు చేయడానికి షోరూంకి వెళ్లినప్పుడు అక్కడ కనిపించే రకరకాల మోడల్స్, ఫీచర్లు చూసి ఏది కొనాలో అర్థం కాక బుర్ర గీక్కుంటాం. ముఖ్యంగా చాలామంది కొనుగోలు చేసే 1.5 టన్ ఏసీని ఎంచుకునేటప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుంటే.. కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా డబ్బు వృధాను అరికట్టవచ్చు.

గదికి తగ్గ ఏసీని ఎంచుకోవాలి:

ఏసీ కొనడాని కంటే ముందు అసలు మీరు ఏ గదిలో ఏసీని బిగించాలనుకుంటున్నారో ఈ గది విస్తీర్ణం ఎంతో తెలుసుకోవాలి. సాధారణంగా 120 నుండి 150 చదరపు అడుగుల లోపు ఉండే గదులకు 1.5 టన్ ఏసీ పక్కాగా సరిపోతుంది. గది చిన్నదైతే ఏసీ త్వరగా చల్లబరుస్తుంది కానీ, మరీ చిన్న గదికి పెద్ద ఏసీ పెడితే కరెంటు బిల్లు భారమవుతుంది. అలాగే గదికి కిటికీలు ఎన్ని ఉన్నాయి? ఎండ నేరుగా తగులుతుందా? అనే విషయాలపై కూడా కూలింగ్ ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి అడుగు ముందుకు వేయాలి.

ఇన్వర్టర్ ఏసీతో కరెంటు ఆదా:

Advertisement

ఇప్పుడు మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీలదే హవా. దీని స్పెషాలిటీ ఏమిటంటే.. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోకుండా, తక్కువ వేగంతో తిరుగుతూ ఉంటుంది. దీంతో కరెంటు బిల్లు చాలా వరకు తగ్గుతుంది. రోజుకు ఎక్కువ గంటలు ఏసీ వాడే వారైతే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడమే బెటర్. దీని రేటు కొంచెం ఎక్కువగా ఉన్నా.. దీర్ఘకాలంలో ఇది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

Also Read: 50 డిగ్రీలకు పైగా ఎండ.. ఎడారి నగరాల్లో చల్లదనానికి వాడే చిట్కాలివే, మీరూ ఫాలో అయిపోవచ్చు!

స్టార్ రేటింగ్ అంటే?

Advertisement

ఏసీ మీద ఉండే స్టార్ రేటింగ్ స్టిక్కర్‌ను తప్పకుండా గమనించాలి. 5-స్టార్ ఏసీ 3-స్టార్ ఏసీ కంటే తక్కువ కరెంటును వాడుకుంటుంది. ఏడాది పొడవునా ఏసీ వాడేవారు 5-స్టార్ తీసుకోవడం మంచిది. అదే కేవలం వేసవిలో రెండు మూడు నెలలు మాత్రమే వాడతారనుకుంటే 3-స్టార్ ఏసీ కూడా సరిపోతుంది. బడ్జెట్‌ను బట్టి, వాడే సమయాన్ని బట్టి ఏ స్టార్ రేటింగ్ కావాలో ముందే నిర్ణయించుకోండి.

కాపర్ కాయిల్స్ ఎందుకు ముఖ్యం?

ఏసీ లోపల ఉండే కాయిల్స్ ఏ మెటీరియల్‌తో తయారయ్యాయో అడగాలి. అల్యూమినియం కంటే కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీలు చాలా కాలం మన్నుతాయి. ఇవి వేడిని త్వరగా బయటకు పంపడమే కాకుండా.. తుప్పు పట్టకుండా ఉంటాయి. రిపేర్లు వచ్చినా కాపర్ కాయిల్స్ ఉన్నప్పుడు చేయడం సులభం. అలాగే గాలిని శుభ్రపరిచే మంచి ఫిల్టర్లు ఉన్నాయో లేదో చూసుకుంటే చల్లదనంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా పొందొచ్చు.

సర్వీస్, వారంటీ వివరాలు:

ఏసీ కొన్న తర్వాత సర్వీస్ ఎలా ఉంటుందనేది అత్యంత కీలకం. మీరు కొనే బ్రాండ్‌కు మీకు దగ్గర్లో మంచి సర్వీస్ సెంటర్ ఉందో లేదో ముందే ఆరా తీయాలి. కంప్రెసర్ మీద ఎక్కువ కాలం వారంటీ ఇచ్చే కంపెనీలకే ప్రాధాన్యత ఇవ్వండి. కొనేటప్పుడే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, స్టెబిలైజర్ ధర వంటి అదనపు ఖర్చుల గురించి క్లియర్‌గా అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే వేసవిలో కూడా కరెంటు బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

Also Read: అయ్య బాబోయ్.. జస్ట్ రూ.799కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్సా? ఫీచర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×