E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో పార్టీ స్పీకర్! ఇది మీ పార్టీ వైబ్స్ మార్చేయడం గ్యారంటీ బాస్

బడ్జెట్ ధరలో పార్టీ స్పీకర్! ఇది మీ పార్టీ వైబ్స్ మార్చేయడం గ్యారంటీ బాస్
Advertisement

boAt Stone 1200: మీరు మ్యూజిక్ లవరా? ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకోవడం, లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లడం ఇష్టమా? అయితే మీ స్మార్ట్‌ఫోన్ సౌండ్ అస్సలు సరిపోదు. అవుట్‌డోర్ పార్టీల్లో గుండెల్లో రీసౌండ్ వచ్చేలా బేస్ ఉండాల్సిందే. అలాంటి మ్యూజిక్ ఫ్రీక్స్ కోసమే ఇండియన్ నెంబర్ వన్ ఆడియో బ్రాండ్ బోట్ నుంచి ఒక అదిరిపోయే పోర్టబుల్ స్పీకర్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. అదే boAt Stone 1200 Bluetooth Speaker. కేవలం రూ. 3,799 బడ్జెట్ ధరలోనే 14W పవర్‌ఫుల్ సౌండ్, ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైట్స్ ,లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ క్రేజీ ఆడియో గ్యాడ్జెట్ ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

ఇండియన్ ఆడియో మార్కెట్లో ‘బోట్’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరి ‘స్టోన్’ సిరీస్ స్పీకర్లు రగ్గడ్ డిజైన్‌కు, పవర్‌ఫుల్ బేస్‌కు కేరాఫ్ అడ్రస్. జులైలో కూడా మ్యూజిక్ లవర్స్ టాప్ ఛాయిస్‌గా నిలిచిన ఈ స్పీకరం టాప్ ఫీచర్లు ఇవే..

1. 14W బోట్ సిగ్నేచర్ సౌండ్ :

Advertisement

ఈ చిన్న స్పీకర్ ఇచ్చే సౌండ్ అవుట్‌పుట్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో 14W పవర్‌ఫుల్ ఆడియో డ్రైవర్స్ ఉన్నాయి. బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ వల్ల హై-ఫై ఆడియో క్వాలిటీతో.. పాటు క్రిస్టల్ క్లియర్ వోకల్స్ లభిస్తాయి. ముఖ్యంగా దీనిలోని పాసివ్ రేడియేటర్స్ ఇచ్చే డీప్ బేస్ ఎఫెక్ట్ వల్ల ఇండోర్ , అవుట్‌డోర్ పార్టీలు అదిరిపోతాయి.

2. కలర్‌ఫుల్ ఆర్‌జీబీ లైట్స్ & రగ్గడ్ డిజైన్:

మ్యూజిక్ వింటున్నప్పుడు రూమ్ లో మంచి పార్టీ వైబ్ రావడానికి ఇందులో ట్రెండీ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైట్స్ ఇచ్చారు. మ్యూజిక్ బీట్స్‌కు తగ్గట్టుగా ఈ లైట్స్ మారుతూ ఉంటాయి. సిలిండ్రికల్ షేప్‌లో ఉండే ఈ స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనికి ఉండే షోల్డర్ స్ట్రాప్ వల్ల ట్రావెలింగ్ చేసేటప్పుడు భుజానికి తగిలించుకుని ఈజీగా తీసుకెళ్లవచ్చు.

3.IPX7 వాటర్ & స్ప్లాష్ ప్రూఫ్ :

Advertisement

పూల్ పార్టీలు లేదా బీచ్ ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు స్పీకర్ పై నీళ్లు పడి పాడైపోతుందనే భయం అస్సలు వద్దు. ఈ బోట్ స్టోన్ 1200 స్పీకర్ IPX7 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. అంటే.. చిన్నపాటి వర్షం వచ్చినా, పొరపాటున నీటి తుంపర్లు పడినా ఈ స్పీకర్‌కు ఏమీ కాదు. హ్యాపీగా టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.

4. 9 గంటల ప్లేటైమ్ & TWS ఫీచర్:

ఇందులో 3600mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఆర్‌జీబీ లైట్స్ ఆఫ్ చేసి వాడుకుంటే.. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 9 గంటల నాన్-స్టాప్ ప్లేటైమ్ లభిస్తుంది. అంతేకాదు. ఇందులో TWS ఫీచర్ కూడా ఉంది. అంటే మీ దగ్గర ఇలాంటివి రెండు స్పీకర్లు ఉంటే.. రెండింటినీ ఒకే సారి ఫోన్‌కి కనెక్ట్ చేసి డబుల్ సౌండ్‌తో.. థియేటర్ లాంటి స్టీరియో ఎఫెక్ట్ పొందవచ్చు. బ్లూటూత్ 5.0తో పాటు FM రేడియో, AUX, USB కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ధర ఎంత?

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో.. ఈ boAt Stone 1200 పోర్టబుల్ స్పీకర్ ధర రూ. 3,799 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా బోట్ అఫీషియల్ వెబ్‌సైట్లలో లభించే బ్యాంక్ డిస్కౌంట్లు లేదా పండుగ సేల్స్ సమయంలో కొంటే.. దీనిని ఇంకా తక్కువ ధరకే తీసుకోవచ్చు. రూ. 4,000 లోపు బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ బేస్, ఆర్‌జీబీ లైట్స్, బ్రాండ్ వాల్యూ దొరకడం బెస్ట్ డీల్.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×