E-Paper
Advertisement

ఫోన్ బ్యాటరీని 100% ఛార్జ్ చేస్తున్నారా? చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే!

ఫోన్ బ్యాటరీని 100% ఛార్జ్ చేస్తున్నారా? చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే!
Advertisement

Battery Health: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శమనిస్తున్నాయి. అయితే చాలా మందికి ఫోన్ బ్యాటరీ 100 శాతం నిండే వరకు ఛార్జ్ చేయడం ఒక అలవాటు. రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేసే వారూ ఉన్నారు. అయితే ఈ ఫోన్ ను ఇలా ఫుల్లుగా ఛార్జ్ చేయడం అస్సలు మంచిది కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కలిగే నష్టాలేంటో ఈ కథనంలో చూద్దాం.

బ్యాటరీల స్వభావం

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ పరిధిలో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్యాటరీ స్థాయి 0% కి పడిపోయినా, 100% కి చేరుకున్నా దానిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా 80 శాతం దాటిన తర్వాత బ్యాటరీని నింపడానికి ఎక్కువ వోల్టేజ్ అవసరమవుతుందని పేర్కొంటున్నారు. ఇది బ్యాటరీ లోపలి నిర్మాణాన్ని దెబ్బతీసి.. త్వరగా పాడయ్యేలా చేస్తుందని తెలియజేస్తున్నారు.

అధిక వేడితో బ్యాటరీకి ముప్పు

Advertisement

బ్యాటరీ 100 శాతానికి చేరుకున్న తర్వాత కూడా అందరు చూసుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత గుర్తొచ్చి.. ఫోన్ ను ముట్టుకున్న సందర్భాల్లో అది చాలా వేడిగా ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ ఓవర్‌ఛార్జ్ కాకపోయినప్పటికీ.. బ్యాటరీ 99% కి రాగానే మళ్లీ 100% కి ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ బ్యాటరీపై నిరంతర ఒత్తిడిని కలిగిస్తుంది.

20-80 రూల్ బెస్ట్

బ్యాటరీ విషయంలో టెక్ నిపుణులు 20-80 అనే గోల్డెన్ రూల్ ను సూచిస్తున్నారు. దీని ప్రకారం ఫోన్ బ్యాటరీని ఎల్లప్పుడూ 20 శాతం నుండి 80 శాతం మధ్య ఉంచాలి. బ్యాటరీ 20 శాతం కంటే తగ్గకుండా.. అలాగే 80 శాతం దాటకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జ్ సైకిల్స్ ఆదా అవుతాయని సూచిస్తున్నారు. ఫలితంగా ఫోన్ బ్యాటరీ ఎక్కువ హెల్తీగా ఉంటుందని తెలియజేస్తున్నారు.

Advertisement

Also Read: రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్ కోసమే కాదు.. అంతకుమించి!

బ్యాటరీ లైఫ్ పెరగాలంటే?

ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు సైతం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారి ప్రకారం.. రోజులో ఒకేసారి 100% ఛార్జ్ చేయడం కంటే.. వీలున్నప్పుడు కొద్దికొద్దిగా ఛార్జ్ చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఫోన్ కంపెనీ అందించిన ఒరిజినల్ ఛార్జర్, బ్రాండెడ్ ఛార్జర్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. మరోవైపు ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడటం, మాట్లాడటం వల్ల ఫోన్ మరింత వేడెక్కి బ్యాటరీ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.

Also Read: స్మార్ట్‌ఫోన్లకే చెమటలు పట్టిస్తున్న.. నోకియా కొత్త కీప్యాడ్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×