E-Paper
Advertisement

ఫ్యూచ‌ర్ సిటీ సిగ‌లో అమెజాన్ క‌లికితురాయి..! భారీ పెట్టుబ‌డుల‌కు శ్రీ‌కారం..!

ఫ్యూచ‌ర్ సిటీ సిగ‌లో అమెజాన్ క‌లికితురాయి..! భారీ పెట్టుబ‌డుల‌కు శ్రీ‌కారం..!
Advertisement

సీఎం రేవంత్ మాన‌స పుత్రిక‌.. తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన భారీ ప్రాజెక్టు.. హైద‌రాబాద్‌కు పోటీగా మ‌రో సరికొత్త న‌గ‌రాన్ని తీర్చిదిద్దే విధంగా రూపొందిస్తున్న భారత్ ఫ్యూచ‌ర్ సిటీకి భారీ పెట్టుబ‌డుల వ‌ర‌ద మొద‌లైంది.

సీఎం కోరుకున్న క‌ల‌ల ప్రాజెక్టుకు.. నిధుల తాకిడి ఆరంభ‌మైంది. దీనికి అమెజాన్ నాంది ప‌లికింది. అంత‌ర్జాతీయ టెక్ దిగ్గ‌జంగా పేరుగాంచిన అమెజాన్ త‌న .. త‌న డేటా సెంట‌ర్‌ను ఫ్యూచ‌ర్ సిటీలో ప్రారంభించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం శంఖుస్థాప‌న చేశారు. 202 ఎకరాల్లో ఏడ‌బ్ల్యూఎస్ క్లౌడ్ సెంట‌ర్ల విస్త‌ర‌ణ కోసం ఈ అమెజాన్ ఒప్పందం చేసుకున్న‌ది.

Advertisement

దాదాపు పుష్క‌ర‌కాలంలో రూ. 60వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప్రాజెక్ట‌ను ప్రారంభించనున్న‌ది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన తెలంగాణ రైజంగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో ఈ మేర‌కు అమెజాన్ సంస్థ ప్ర‌భుత్వంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న‌ది. ఆ ఒప్పందం మేర‌కు ఇవాళ త‌న ప్రాజెక్టు ప‌నిని ప్రారంభించింది.

ఇది ఫ్యూచ‌ర్ సిటీ సిగ‌లో ఓ క‌లికితురాయిగా నిల‌వ‌నుంది. అమెజాన్‌తోనే ఫ్యూచ‌ర్ సిటీకి భారీ పెట్టుబడులు రావ‌డం ప్రారంభ‌మైంద‌ని చెప్పాలి. అమెజాన్ దీనికి నాంది ప‌లికింది. ఇంకా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఈ ప‌రిణామంతో క్యూ క‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వ ఐటీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

అయితే పుష్కర‌కాలంలో దాదాపు రూ. 60వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని అమెజాన్ భావించినా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. ఎనిమిదేళ్ల‌లో ల‌క్ష కోట్ల రూపాయ‌లు పెట్ట‌బ‌డులు పెట్టే విధంగా చొరవ చూపాల‌ని కోరారు. తను అనుకున్న ల‌క్ష్యానికి చేరువ కావాలంటే అమెజాన్ సంస్థ 2034 వ‌ర‌కు ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి అమెజాన్ డేటా సెంట‌ర్ ఓ స్టెప్పింగ్ స్టోన్‌గా నిల‌వ‌నుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశానికే..ఈ ఫ్యూచ‌ర్ సిటీని అభివృద్ది మోడ‌ల్‌గా చూపాల‌న్న‌దే త‌న సంక‌ల్ప‌మ‌ని, ఇప్ప‌డిప్పుడు దానికి తొలి అడుగులు ప‌డుతున్నాయ‌న్నారాయ‌న‌. కాగా ఈ ఫ్యూచ‌ర్ సిటీకి త‌మ విలువైన భూములిచ్చిన రైతుల‌కు కూడా ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇక్క‌డ కంపెనీలు రావ‌డం మూలంగా.. ప్ర‌యార్టీగా భూములిచ్చిన వారి పిల్ల‌ల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ఇవ్వ‌డంతో పాటు మంచి ప‌రిహారం కూడా ఇస్తామ‌న్నారు. లోక‌ల్‌గా ఉన్న నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు మెండుగా దొరుకుతాయ‌ని కూడా ఆయన చెప్పారు. అమెజాన్ రాక‌తో.. ఫ్యూచ‌ర్ సిటీ మ‌రింత స్పీడ్‌గా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌నుంది. దీంతో కొత్త కొత్త కంపెనీలు కూడా దీని వైపు దృష్టి సారించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×