E-Paper
Advertisement

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్
Advertisement

boAt Rockerz 550 : మ్యూజిక్ లవర్స్, గేమర్లకు మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చే ఓవర్-ఈర్ హెడ్‌ఫోన్స్ అంటే చాలా ఇష్టం. అయితే బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఐసోలేషన్, పంచీ బేస్ అందించే డివైస్ ఎంచుకోవడం ముఖ్యం.నేడు ఆడియో మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా నిలిచిన ‘బోట్’ (boAt) నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడలే boAt Rockerz 550 Headphone. కేవలం రూ. 1,798 అందుబాటులో ఉన్న ఈ హెడ్‌ఫోన్స్ ఆకట్టుకునే డిజైన్, ధృడమైన బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

boAt Rockerz 550 పూర్తి వివరాలు:

ఐకోనిక్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ:
ఈ హెడ్‌ఫోన్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్ లుక్‌తో కనిపిస్తాయి. ఇవి ఓవర్-ఈర్ డిజైన్‌తో రావడం వల్ల చెవులను పూర్తిగా కవర్ చేస్తాయి. ఎర్గోనామిక్ డిజైన్, మెత్తని ఇయర్ కుషన్స్ ఉండటం వల్ల గంటల తరబడి పాటలు విన్నా, సినిమాలు చూసినా చెవులకు ఎలాంటి నప్పి లేదా అసౌకర్యం అనిపించదు. పైగా విభిన్నమైన ఆర్టిస్టిక్ కలర్స్, ప్యాటర్న్లలో లభించడం దీని మరో ప్రత్యేకత.

Advertisement

సూపర్ ఆడియో అండ్ పవర్‌ఫుల్ బేస్:
ఈ హెడ్‌ఫోన్స్‌లో 50mm నానో-డైనమిక్ డ్రైవర్లు అమర్చారు. ఇవి ఆడియోను, స్పష్టమైన వోకల్స్‌ను, బోట్ స్పెషల్ ‘Signature Sound’ పంచీ బేస్‌ను అందిస్తాయి. బేస్ ఎక్కువగా ఉండే పాటలు వినేవారికి ఇది ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. ఓవర్-ఈర్ డిజైన్ వల్ల బయటి శబ్దాలు చాలా వరకు తగ్గిపోయి పాసివ్ నోయిస్ ఐసోలేషన్ లభిస్తుంది.

ఫిజికల్ నోయిస్ ఐసోలేషన్ అండ్ కాలింగ్:
ఇందులో ఫిజికల్ నోయిస్ ఐసోలేషన్ సపోర్ట్ ఉండటం వల్ల మీ చుట్టూ ఉండే అనవసరమైన శబ్దాలు పాటల వినికిడికి అంతరాయం కలిగించవు. అంతేకాకుండా.. ఇందులో ఇన్-బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, మీ ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి వాయిస్ అసిస్టెంట్‌లను హెడ్‌ఫోన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

సుదీర్ఘ బ్యాటరీ లైఫ్:
ఈ హెడ్‌ఫోన్స్‌లో 500mAh సామర్థ్యం కలిగిన పవర్‌ ఫుల్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు 20 గంటల పాటు నిరంతరాయంగా మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుంది. రోజంతా వర్కౌట్స్ చేసినా, ప్రయాణాలు చేసినా బ్యాటరీ అయిపోతుందనే భయం ఉండదు. ఒకవేళ ఛార్జింగ్ అయి పోయినా AUX కేబుల్ కనెక్ట్ చేసి వైర్డ్ హెడ్‌ఫోన్‌లా కూడా వాడుకోవచ్చు.

కనెక్టివిటీ:
కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ v5.0 వెర్షన్ అందించారు. ఇది దాదాపు 10 మీటర్ల పరిధి వరకు వేగ వంతమైన, స్థిరమైన కనెక్టివిటీని ఇస్తుంది. దీనిపై ఇచ్చే ఫిజికల్ బటన్ల ద్వారా వాల్యూమ్ అడ్జస్ట్ చేయడం, పాటలు మార్చడం ఈజీ.

మొత్తానికి రూ. 1,798 బడ్జెట్‌లో ఆకట్టుకునే డిజైన్, డీప్ బేస్, 20 గంటల బ్యాటరీ లైఫ్ , డ్యూయల్ మోడ్ (వైర్‌ లెస్ & వైర్డ్) కనెక్టివిటీ కోరుకునే వారికి boAt Rockerz 550 ఒక పర్ఫెక్ట్ చాయిస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×