E-Paper
Advertisement

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Advertisement

TG ICET 2026 Counselling Schedule: తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి టీజీ ఐసెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో , సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన సమక్షంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 31 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది.

TG ICET 2026 కౌన్సెలింగ్ పూర్తి వివరాలు:
విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 22 హెల్ప్‌లైన్ సెంటర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ వెల్లడించారు. తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జులై 31 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఫీజు చెల్లించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న ఆప్షన్లు ఆగస్టు 8న ఫ్రీజ్ అవుతాయి. అనంతరం ఆగస్టు 11న లేదా అంతకంటే ముందు మొదటి విడత సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. తొలి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14 మధ్య వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన వెంటనే తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. చివరి విడత స్లాట్ బుకింగ్ ఆగస్టు 17న ప్రారంభం కాగా, ఆగస్టు 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆఖరి విడత సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 22న లేదా అంతకంటే ముందు అధికారికంగా విడుదల చేస్తారు. చివరి విడతలో సీటు సాధించిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 24 వరకు ఆన్‌లైన్ ద్వారా కళాశాల ఫీజు చెల్లించి, ఆగస్టు 22 నుంచి 25 నాటికి తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×