E-Paper
Advertisement

కిరణ్ అబ్బవరం హిట్స్ వెనుక పీఆర్ టీమ్ బలంగా ఉందా?

కిరణ్ అబ్బవరం హిట్స్ వెనుక పీఆర్ టీమ్ బలంగా ఉందా?
Advertisement

Kiran abbavaram:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్ఫూర్తిగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ సరైన సబ్జెక్టుతో.. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. సాయి రాజేష్(Sai rajesh) అందించిన కథతో రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా.. ధైర్యంగా, నిజాయితీగా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఆ జెన్యూన్ సమాధానానికి ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది నెటిజన్స్ కి గట్టి కౌంటర్ పడిందని చెప్పవచ్చు.

పీఆర్ టీం వల్లే కిరణ్ సక్సెస్ అందుకుంటున్నారా?

చెన్నై లవ్ స్టోరీ ప్రెస్ మీట్ లో భాగంగా రిపోర్టర్ మాట్లాడుతూ.. “కిరణ్ అబ్బవరం చూడడానికి చాలా అమాయకుడిగా కనిపిస్తారు. కానీ ఆయన వెనుక ఉన్న పీఆర్ టీమ్ మాత్రం చాలా గట్టిది. పీఆర్ టీమ్ వాడుకొని ఈ సినిమాతో మంచి హిట్ కొట్టారు. అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటి?” అని ప్రశ్నించారు.

Advertisement

also read:బన్నీ మూవీలో హీరోయిన్ ఉండదా? మార్క్ చూపించబోతున్న లోకేష్!

వద్దన్న నిర్వాహకులు.. కిరణ్ జెన్యూన్ సమాధానం..

అయితే అదే సమయంలో విలేకరు అడిగిన ప్రశ్నకు అక్కడున్న నిర్వాహకులు కిరణ్ అబ్బవరంను ఆపే ప్రయత్నం చేశారు. అయితే కిరణ్ అబ్బవరం ఏమాత్రం తగ్గకుండా.. “పర్లేదు అన్న నేను సమాధానం చెబుతాను. తప్పేముంది.. కెమెరా నా వైపు తిప్పండి. కచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను” అంటూ చాలా కూల్ గా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఆసక్తి కనపరిచారు.

రిపోర్టర్ ప్రశ్నకు కిరణ్ ఏమన్నారంటే?

Advertisement

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఒకవేళ పీఆర్ టీం తోనే హిట్ కొట్టేటట్లయితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి సినిమాకి అలాగే హిట్ కొట్టొచ్చు కదా.. ఏదైనా ఒక సినిమా సక్సెస్ అందుకుంది అంటే, ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కేవలం సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందనే కారణంతో ఏది పడితే అది మాట్లాడేయడం.. ఏది పడితే అది పోస్ట్లు పెట్టేయడం అనే విధానాన్ని నేను ఎంత మాత్రం నమ్మను. ఏ సినిమా అయినా సరే పిఆర్ టీం ద్వారా ఎంత రుద్దినా లేదా ఎంత ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు చూడకుండా.. ఆ సినిమా విజయం సాధించలేదు కదా..

థియేటర్లకు వచ్చి తమ కుటుంబ సమేతంగా సినిమాను చూసి ఆదరిస్తున్న సాధారణ ప్రేక్షకుల అభిరుచిని మనం ముందుగా గౌరవించాలి. ముఖ్యంగా ఒక సినిమా సాధించే అసలైన విజయం పీఆర్ స్టంట్స్ వల్ల రాదు. కేవలం ప్రేక్షక ఆదరణ వల్లే వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా విజయం వెనుక ఉన్న అసలైన శక్తి కేవలం ప్రేక్షకుడు మాత్రమే” అంటూ తనదైన శైలిలో స్పందించారు కిరణ్ అబ్బవరం . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×