E-Paper
Advertisement

Best Projectors 2026: ఇంట్లోనే ఫ్యామిలీతో మూవీ నైట్.. థియేటర్ ఫీల్ ఇచ్చే బెస్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

Best Projectors 2026: ఇంట్లోనే ఫ్యామిలీతో మూవీ నైట్.. థియేటర్ ఫీల్ ఇచ్చే బెస్ట్ ప్రొజెక్టర్లు ఇవే!
Advertisement

Best Projectors 2026: సండే వచ్చిందంటే చాలు.. ఫ్యామిలీతో కలిసి హాయిగా ఏదైనా సినిమా చూడాలని అందరికీ ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న చిన్న టీవీలో ఆ థియేటర్ కిక్కు రాదు. పెద్ద స్క్రీన్ టీవీ కొందామంటే బడ్జెట్ దాటిపోతుంది. అందుకే ఇప్పుడు చాలామంది ప్రొజెక్టర్ల వైపు చూస్తున్నారు. 2026లో వచ్చిన లేటెస్ట్ ప్రొజెక్టర్లు పిక్చర్ క్వాలిటీలో టీవీలకు ఏమాత్రం తగ్గట్లేదు. పైగా వీటిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. మరి ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన టాప్ ప్రొజెక్టర్లేంటో చూసేద్దామా..

Xgimi Horizon 20 Max

హారిజన్ సిరీస్‌లోనే ఇది బాస్ లాంటిది. దీనిలో ఉండే ఆర్‌జీబీ ట్రిపుల్ లేజర్ టెక్నాలజీ వల్ల బొమ్మ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. పగటిపూట కిటికీలు తెరిచి ఉన్నా కూడా స్క్రీన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని లుక్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ముఖ్యంగా గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే.. దీనిలో అస్సలు లాగ్ ఉండదు. దీని ధర సుమారు రూ.2,94,000 ఉంటుంది.

Xgimi Horizon 20 Pro

Advertisement

బడ్జెట్ మరీ ఎక్కువ కాకుండా, ఫీచర్లు మాత్రం అన్నీ కావాలనుకుంటే ఇది ది బెస్ట్ ఆప్షన్. దీనిలో డాల్బీ విజన్ ఉండటం వల్ల కలర్స్ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఈ ప్రొజెక్టర్‌లో గూగుల్ టీవీ ముందే ఉంటుంది కాబట్టి, మనం విడిగా ఎలాంటి స్టిక్స్ వాడక్కర్లేదు. గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఇది చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. దీని ధర రూ.2,44,000 నుంచి ప్రారంభం అవుతుంది.

Also Read: రీల్స్, షార్ట్స్‌‌లోని మూవీ క్లిప్స్‌ పోస్టుల్లో సినిమా పేర్లు ఎందుకు చెప్పరు? ఇంత కుట్ర ఉందా?

Xgimi Horizon 20

Advertisement

తక్కువ ధరలో క్వాలిటీ ప్రొజెక్టర్ కావాలనుకునే వారికి ఇది కరెక్ట్ ఛాయిస్. దీని సెటప్ చేయడం చాలా ఈజీ. గోడకు ఎటువైపు పెట్టినా ఇది ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ను అడ్జస్ట్ చేసేసుకుంటుంది. దీనివల్ల ఇంట్లోనే ఐమాక్స్ థియేటర్ ఫీలింగ్ వస్తుంది. తక్కువ రేటులో మంచి సినిమా అనుభవాన్ని ఇస్తుంది. ఈ ప్రొజెక్టర్ ధర రూ.1,68,000 వరకు ఉంటుంది.

Dangbei MP1 Max

వాల్యూ ఫర్ మనీ కోరుకునే వారికి డాంగ్‌బే ఎమ్‌పీ1 మాక్స్ బాగా నచ్చుతుంది. ఇది లేజర్, ఎల్‌ఈడీ రెండింటినీ వాడుకుంటుంది కాబట్టి.. విజువల్స్ అదిరిపోతాయి. ఏఐ ఫీచర్ ఉండటం వల్ల స్క్రీన్ అలైన్‌మెంట్ గురించి టెన్షన్ పడక్కర్లేదు. దీనిలో నెట్‌ఫ్లిక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంచక్కా సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర సుమారు రూ.1,22,500 ఉంటుంది.

Soundcore Nebula X1

సినిమా చూసేటప్పుడు విజువల్స్ ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే ముఖ్యం కదా. ఈ నెబ్యులా ఎక్స్1లో స్పెషల్ ఏంటంటే.. దీని సౌండ్ సిస్టమ్ అదిరిపోతుంది. విడిగా హోమ్ థియేటర్ స్పీకర్లు కొనాల్సిన అవసరమే ఉండదు. చీకటి సీన్లు ఉన్న సినిమాల్లో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. దీని ధర సుమారు రూ.2,52,000.

Also Read: వావ్.. సోలార్‌ పవర్‌తో పనిచేసే ఈ స్టవ్ గురించి మీకు తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×