E-Paper
Advertisement

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

మొయినాబాద్ డ్రగ్స్ కేసుతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.  మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తప్పు చేసినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. ప్రస్తుతం పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

తాను గతంలోనే డ్రగ్ టెస్టులకు సిద్ధమని ప్రకటించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తిపై స్పందిస్తూ.. అది వారి అంతర్గత విషయమని.. తాము ఆయనతో ఎటువంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ రాకపై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని.. ప్రస్తుతానికి తమ దెబ్బకే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.

Advertisement

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు ఉత్తర్వులు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. సభను తప్పుదోవ పట్టించిన భట్టి రాజీనామా చేయాలా లేక నిలదీసిన తాను చేయాలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రి సీతక్క వ్యాఖ్యలకు అర్థం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం.. హ్యామ్ రోడ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. మంత్రుల కంటే అధికారులే ఎక్కువగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఆరునూరైనా ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని చెప్పడానికి అధికారులు రాజకీయ నాయకులు కాదని హితవు పలికారు. మూసీ డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డీపీఆర్ ఇవ్వకపోతే మంత్రి శ్రీధర్ బాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు. ఎలాంటి ప్రణాళిక.. నిధులు లేకుండానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

రాష్ట్రంలో కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని.. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారు ఇతర గుర్తులతో పోటీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు.

ALSO READ: CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×