E-Paper
Advertisement

Spy Camera: హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు..!

Spy Camera: హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు..!
Advertisement

Spy Camera: స్వేచ్ఛ బ్యూరో: మహిళా భద్రత కోసం హైదరాబాద్​ సీపీ వీ.సీ.సజ్జనార్​ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్​ పరిధిలోని అన్ని షాపింగ్ మాళ్లు, కాలేజీలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, ఇంటర్నెట్​ సెంటర్లు, హోటళ్లు, లాడ్జీల్లో స్పై కెమెరా డిటెక్టర్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్ల అధికారులు తమ తమ పరిధుల్లోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలతోపాటు హాస్పిటళ్లు, హోటళ్లు, లాడ్జీలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

ఎన్నో విషాదాలు..

సైదాబాద్ లో నివాసముంటూ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి కారణం కొంతమంది ఆమె బాత్రూం వీడియోలను రికార్డు చేసి బ్లాక్​ మెయిల్ చేయటమే. హైదరాబాద్ లో ఇదే మొదటి విషాదం కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోల భయంతో పలువురు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు ఎక్కడ పరువు పోతుందోనని బ్లాక్​ మెయిలర్లు అడిగినంత డబ్బు సమర్పించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలాంటి వీడియోలను స్పై కెమెరాలను ఉపయోగించి రికార్డు చేస్తుండటం. షాపింగ్ కాంప్లెక్స్​ లు, హాస్పిటళ్లు, హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఓయో రూంలు లాడ్జీల్లో కొంతమంది స్పై కెమెరాలను అమర్చి వీడియోలను రికార్డు చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక, వస్త్ర షోరూముల్లో ఉండే ట్రయల్ ఛేంజింగ్​ రూముల్లో కూడా ఇలాంటి స్పై కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని కొందరు టార్గెట్​ గా చేసుకున్న వారిని బ్లాక్​ మెయిల్​ చేసి లక్షల్లో డబ్బు గుంజితే..మరికొందరు లైంగిక వాంఛలు తీర్చాలని బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

Also read: బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

ఈ నేపథ్యంలోనే..

ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం కమిషనర్​ సజ్జనార్​ స్పై కెమెరా డిటెక్టర్లను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు సూచించారు. ఈ ఉత్తర్వులు అమలయ్యేట్టు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్​ స్టేషన్ల సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. స్పై కెమెరాలు ఏర్పాటు చేయని వారిపై చర్యలు తీసుకోవటంతోపాటు వాళ్లు నడుపుతున్న వ్యాపార, వాణిజ్య సంస్థలను సీజ్​ చేయాలని చెప్పారు, ఈ క్రమంలో సీఐలు తమ తమ స్టేషన్ల పరిధుల్లోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, హాస్టళ్లు, హాస్పిటళ్లు నడిపిస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్ణీత గడువులోపు స్పై కెమెరా డిటెక్టర్లను ఏర్పాటు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు స్పై కెమెరా డిటెక్టర్లను ఏర్పాటు చేసినట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Also Read: Yoga Day Celebrities: యోగా డే స్పెషల్.. హీరోయిన్ల యోగ పోజులు..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×