E-Paper
Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!
Advertisement

Best Air Fryer Brands 2026: ఇప్పుడున్న రోజుల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ 65 అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ.. వాటిలో ఉండే ఆయిల్ చూసి భయపడి చాలా మంది తినడం మానేస్తున్నారు. అందుకే, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండానే క్రిస్పీగా, టేస్టీగా వండుకునే ‘ఎయిర్ ఫ్రైయర్స్’ (Air Fryers) కి ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇండియన్ కిచెన్స్‌ కోసం ఎక్కువగా అమ్ముడవుతున్న, బెస్ట్ రేటింగ్స్ ఉన్న టాప్ 3 ఎయిర్ ఫ్రైయర్ బ్రాండ్స్, వాటి ధరల వివరాలు ఇప్పుుడు తెలుసుకుందాం.

1. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ (Philips Air Fryer):

కింగ్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ఎయిర్ ఫ్రైయర్ టెక్నాలజీ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ‘ఫిలిప్స్’. దీని ‘రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ’ ఆహారాన్ని చుట్టుపక్కల సమానంగా ఉడికించి, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంచుతుంది.
Philips 4.2L (NA120/00) అనలాగ్ మోడల్: చిన్న ఫ్యామిలీస్ లేదా బిగినర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 4,850 వరకు ఉంది.
Philips 6.2L (NA231/00) డిజిటల్ మోడల్: పెద్ద ఫ్యామిలీస్ కోసం, టచ్ స్క్రీన్ ఇంకా వంటను చూసేందుకు వీలుగా విండోతో వస్తుంది. దీని ధర దాదాపు రూ.11,995 వరకు ఉంటుంది.
ఎందుకు కొనాలి?: 90% వరకు తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు, బ్రాండ్ నమ్మకం, 2 ఏళ్ల వారంటీ వీటి ప్లస్ పాయింట్.

2. ప్రెస్టీజ్ న్యూట్రిఫ్రై ఎయిర్ ఫ్రైయర్ (Prestige NutriFry):

Advertisement

ఇండియన్ బడ్జెట్ ఫ్రెండ్లీఇండియన్ కిచెన్ వస్తువుల్లో ప్రెస్టీజ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. బడ్జెట్ ధరలో మంచి క్వాలిటీ, సింపుల్ ఆపరేషన్ కోరుకునే వారికి ప్రెస్టీజ్ బెస్ట్ ఛాయిస్.
Prestige NutriFry Digital (4.5L): 8 రకాల ప్రీ-సెట్ మెనూలు, సులభమైన డిజిటల్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని ధర సుమారు రూ.5,500 వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఎందుకు కొనాలి?: 80శాతం తక్కువ ఆయిల్‌తో సమోసాలు, ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇది తక్కువ పవర్ (1200W) తీసుకుంటుంది .సర్వీస్ సెంటర్లు ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి.

3. అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ (Agaro Air Fryer):

మోడరన్ ఫీచర్స్, రీజనబుల్ ప్రైస్ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రెండ్స్ మరియు రివ్యూస్ పరంగా ‘అగారో’ బ్రాండ్ దూసుకుపోతోంది. తక్కువ ధరలోనే ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ ఇవ్వడం ఈ బ్రాండ్ ప్రత్యేకత.
Agaro Galaxy Digital (4.5L): 7 ప్రీ-సెట్ ప్రోగ్రామ్స్, 360 డిగ్రీల ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో వస్తుంది. దీని ధర కేవలం రూ. 3,999 గా ఉంది.
Agaro Regency (12L) ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్: బేకింగ్, రోస్టింగ్, టోస్టింగ్ అన్నీ ఒకే దాంట్లో పెద్ద మొత్తంలో చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ. 9,999 గా ఉంది.

Advertisement

Also Read: వేసవి తాపానికి చెక్ పెట్టే.. బెస్ట్ కూలర్స్ ఏవి?

ఎందుకు కొనాలి?: ఓవర్ హీట్ ప్రొటెక్షన్, నాన్-స్టిక్ బాస్కెట్స్, క్లీన్ చేయడం చాలా ఈజీ. మోడరన్ లుక్ కిచెన్ కి మంచి అల్ట్రా-లుక్ ఇస్తుంది.

మీకు బ్రాండ్ వాల్యూ, లాంగ్ లైఫ్ ముఖ్యం అనుకుంటే ఫిలిప్స్ (Philips) వైపు వెళ్ళవచ్చు. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన ఇండియన్ బ్రాండ్ కావాలంటే ప్రెస్టీజ్ (Prestige) బెస్ట్. ఒకవేళ తక్కువ ధరలో అడ్వాన్స్డ్ టచ్ స్క్రీన్ ఫీచర్లు, ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే అగారో (Agaro) మంచి ఆప్షన్. మీ హెల్త్ జర్నీని హ్యాపీగా స్టార్ట్ చేయడానికి వీటిలో ఒకదాన్ని మీ కిచెన్‌లోకి తెచ్చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×